AC Blast: ముగ్గురి ప్రాణం తీసిన ఏసీ.. తల్లి సహా ఇద్దరు పిల్లల సజీవ దహనం..

|

Mar 07, 2023 | 9:54 AM

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో తల్లి, ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటన రాయచూరు తాలూకాలోని శక్తి నగర్‌లో చోటుచేసుకుంది.

AC Blast: ముగ్గురి ప్రాణం తీసిన ఏసీ.. తల్లి సహా ఇద్దరు పిల్లల సజీవ దహనం..
Crime News
Follow us on

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో తల్లి, ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటన రాయచూరు తాలూకాలోని శక్తి నగర్‌లో చోటుచేసుకుంది. శక్తినగర్‌ కేపీసీఎల్‌ కాలనీలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని రాయచూరు పోలీసులు వెల్లడించారు. మృతులను రంజిత (33), పిల్లలు మృదుల (13), తరుణ్య (5)గా శక్తినగర్‌ పోలీసులు గుర్తించారు.

మాండ్య వాసి సిద్దలింగయ్య స్వామి భార్యాపిల్లలతో కలిసి కేపీసీఎల్‌ కాలనీలో నివాసముంటున్నాడు. ఈ సమయంలో సోమవారం షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలరేగాయాయని దీంతో ముగ్గురు సజీవ దహనమైనట్లు పేర్కొంటున్నారు. అయితే, ఏసీలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలకు స్పష్టమైన కారణం తెలియరాలేదని.. దీనిపై విచారణ చేపట్టినట్లు రాయచూరు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు.

అయితే, సిద్దలింగయ్య స్వామి శక్తినగర్‌ థర్మల్‌ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్నారు. ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన శక్తినగర్ పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..