చుట్టూ నీరు.. ట్రైన్‌లో ప్రయాణికులు .. ప్రాణాలతో కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు

| Edited By:

Jul 27, 2019 | 5:05 PM

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే సర్వీసులను అధికారులు నిలిపివేశారు. దీంతో దాదాపు 2000 మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయారు. ముంబై-కోల్హాపూర్ మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్‌ వరద నీటిలో చిక్కుకుపోయింది. శుక్రవారం రాత్రి నుంచి థానే జిల్లాలోని బద్లాపూర్- వంగానీ రైల్వే స్టేషన్ల మధ్య ఈ రైలు నిలిచిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నలువైపులాల నీరు వచ్చి చేరడంతో.. నిల్చోడానికి […]

చుట్టూ నీరు.. ట్రైన్‌లో ప్రయాణికులు .. ప్రాణాలతో కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు
Follow us on

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే సర్వీసులను అధికారులు నిలిపివేశారు. దీంతో దాదాపు 2000 మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయారు. ముంబై-కోల్హాపూర్ మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్‌ వరద నీటిలో చిక్కుకుపోయింది. శుక్రవారం రాత్రి నుంచి థానే జిల్లాలోని బద్లాపూర్- వంగానీ రైల్వే స్టేషన్ల మధ్య ఈ రైలు నిలిచిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నలువైపులాల నీరు వచ్చి చేరడంతో.. నిల్చోడానికి కూడా స్థలం లేకుండా పోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో.. అధికారులు అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు. గత 15 గంటల నుంచి తమకు ఆహారం, మంచి నీరు లభించడం లేదని బాధపడుతున్నారు. తమను కాపాడాలంటూ.. వీడియోల ద్వారా మొరపెట్టుకుంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. రెండు హెలికాప్టర్లతో పాటు, రెస్క్యూ బోట్స్‌ ద్వారా మొత్తం 500 మంది  ప్రయాణికులందరినీ రక్షించారు.