Monkeypox: మంకీ పాక్స్.. ఇప్పుడు అందరిని కలవరపెడుతున్న సరికొత్త వైరస్ ఇది. ఇప్పుడు దేశంలో ఏకంగా నాలుగు కేసులు వచ్చాయి. మరోవైపు కాలిఫోర్నియాలో అరుదైన కేసు బయటపడటం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరగడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఢిల్లీలో మరో కేసు బయట పడటం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో దేశంలో మొత్తం నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు అధికారులు. ఆదివారం ఢిల్లీలో బయటపడిన కేసులో.. బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదు. కానీ వైరస్ సోకింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా తరహాలోనే మంకీపాక్స్ కట్టడికి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
ఇప్పటి వరకు 75 దేశాలకు వైరస్..
పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ మంకీపాక్స్ ఇప్పటివరకు 75 దేశాలకు విస్తరించింది. 16వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO ప్రకటించింది. ఇలాంటి సమయంలో కాలిఫోర్నియాలో బయటపడిన ఓ కేసు వణికిస్తోంది. ఒకే వ్యక్తికి కరోనా, మంకీపాక్స్ సోకడం ఆందోళన కలిగించే అంశం.
అయితే కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జూన్ నెలాఖరులో కోవిడ్ బారిన పడ్డారు. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు జ్వరం, తలనొంప్పి ఇతర సమస్యలతో బాధపడ్డారు. అలాగే ఆయన బాడీపై రెడ్ కలర్‌లో పొక్కులు ఏర్పడటం ప్రారంభమైంది. దీంతో వైద్యులు అతని రక్తనమూనాలను పరీక్షించగా, రెండు వైరస్‌లు ఒకేసారి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి