AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ ‘విదేశీ’ స్లోగన్.. ఫారిన్ స్టూడెంట్స్ తో ‘భలే ప్రయోగం’

ఇండియాను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం బృహత్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు అనువుగా ‘డెస్టినేషన్ హబ్’ పేరిట  విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరో రెండేళ్ల కల్లా (2022)నాటికి 2 లక్షల మంది ఫారిన్ విద్యార్థులకు ఇండియాలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విద్యా సంస్థల్లో యోగా, బౌధ్ధిజం, ఆయుర్వేద వంటివాటితో స్వల్ప కాలిక  కోర్సులను కూడా బోధిస్తారని సమాచారం. అమెరికా, బ్రిటన్ లాంటి ధనిక దేశాల నుంచి […]

మోదీ 'విదేశీ' స్లోగన్.. ఫారిన్ స్టూడెంట్స్ తో 'భలే ప్రయోగం'
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 13, 2020 | 4:43 PM

Share

ఇండియాను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం బృహత్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు అనువుగా ‘డెస్టినేషన్ హబ్’ పేరిట  విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరో రెండేళ్ల కల్లా (2022)నాటికి 2 లక్షల మంది ఫారిన్ విద్యార్థులకు ఇండియాలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విద్యా సంస్థల్లో యోగా, బౌధ్ధిజం, ఆయుర్వేద వంటివాటితో స్వల్ప కాలిక  కోర్సులను కూడా బోధిస్తారని సమాచారం. అమెరికా, బ్రిటన్ లాంటి ధనిక దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వఛ్చి అడ్మిషన్లు పొందడానికి అనువుగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిలేషన్స్, మానవ వనరుల మంత్రిత్వ శాఖ వంటివి కృషి చేయనున్నాయి.  డెస్టినేషన్ ఇండియా కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా తమవంతు తోడ్పాటును అందించనున్నాయి. ఇందులో భాగంగా వీసా నిబంధనలను సరళతరం చేయడం, విదేశీ యూనివర్సిటీలతో సాధారణ ఒప్పందాలు లాంటి ప్రతిపాదనలను సిధ్ధం చేస్తున్నారు.

2009- 2016మధ్య కాలంలో ఇండియాను విజిట్ చేసిన విదేశీ విద్యార్థుల సంఖ్య ఏడాదికి 12 శాతం చొప్పున పెరుగుతోందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ విభాగం అంచనా వేస్తోంది. (చైనాలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది). ముఖ్యంగా 10 దేశాల నుంచి వస్తున్న స్టూడెంట్స్ సంఖ్య 63 శాతం ఉందట. నేపాల్ నుంచి 21 శాతం ఉండగా..  ఆఫ్ఘనిస్తాన్ నుంచి 10 శాతం,  ఆఫ్రికా, సూడాన్, నైజీరియాల నుంచి అయిదు శాతం చొప్పున ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి అభివృధ్ది చెందిన దేశాల నుంచి టూరిస్టు వీసాలపై అనేకమంది విద్యార్థులు ఇండియాను సందర్శిస్తున్నారు. వీరి రాకను ఇలా వినియోగించుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

Follow Us
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు