శత్రువులకు దడ పుట్టించే విధంగా భారత యుద్ద నౌక INS మోర్ముగావ్ జలప్రవేశం చేసింది. అధునాతన క్షిపణులను ప్రయోగించే వ్యవస్థ ఈ యుద్దనౌకలో పొందుపర్చారు. ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో ఇండియన్‌నేవీకి ఈ నౌకను అప్పగించారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఇండియన్ నేవీ అమ్ముల పొదిలోకి మరోఅద్భుత అస్త్రం చేరింది. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా దేశీయంగా నిర్మించిన క్షిపణి విధ్వంసక నౌక..INS మోర్ముగావ్ జలప్రవేశం చేసింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్..ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో INS మోర్ముగావ్ ను నౌకాదళానికి అప్పగించారు.
INS మర్ముగోవా 7,400 టన్నుల బరువు, 163 మీటర్ల పొడవు. 17 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ యుద్ధనౌకలో అత్యాధునిక సెన్సర్లు, రాడార్ వ్యవస్థలను అమర్చారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైన, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ దీనిలో ఉంది. ఇది P15 బ్రేవర్ క్లాసుకు చెందినది. ఎలాంటి సమయంలోనైనా దీన్ని ఆపరేట్ చేసేలా తయారుచేశారు.
యాంటీ ఎయిర్, యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు ఈ షిప్‌లో ఉన్నాయి. మిస్సైల్ వ్యవస్థ కూడా ఉంది. INS మోర్ముగావ్..సెకండ్ జనరేషన్‌కు చెందిన స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్. ప్రాజెక్టు 15బీ కింద దీన్ని తయారు చేశారు. భారత నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని డిజైన్ చేసింది. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ దీన్ని నిర్మించారు. విశాఖపట్టణం, మర్మగోవా, ఇంపాల్, సూరత్ నగరాల పేరు మీద నాలుగు విధ్వంసక యుద్ధ నౌకలను తయారు చేస్తున్నారు. వాటిలో ఇది రెండోది.
INS మోర్ముగావ్ ఎంట్రీతో భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. ఐఎన్‌ఎస్ మోర్ముగావ్‌ను భారత్‌లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌక ఒకటిని అన్నారు రాజ్‌నాథ్. భవిష్యత్‌లో మరిన్ని యుద్ద నౌకలు తయారు చేస్తామన్నారు.
‘Mormugao’, a P15B stealth guided missile destroyer, is ready to be commissioned into the Indian Navy.
I shall be in Mumbai today, 18th December, to attend the Commissioning Ceremony. Looking forward to it.@indiannavy pic.twitter.com/kp6shpfrWk
— Rajnath Singh (@rajnathsingh) December 18, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..