AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభినందన్ కు వీర్ చక్ర..మింటీకి యుద్ధ్ సేవా మెడల్

అభినందన్ వర్థమాన్. భారత వాయుసేన పైలట్. శత్రు విమానాలను తరుముతూ వెళ్లి ఆ దేశ సైనికులకు చిక్కినా ఏ మాత్రం బెదరని ధీరుడు. అతని ధైర్య సాహసాలను మెచ్చిన కేంద్రం.. వీర్ చక్ర అవార్డ్ ప్రకటించింది.  ఇక అభినందన్ కు ఎప్పటికప్పుడు సూచనలు చేసిన స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ కు యుద్ధ్ సేవా మెడల్ దక్కింది. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ […]

అభినందన్ కు వీర్ చక్ర..మింటీకి యుద్ధ్ సేవా మెడల్
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Aug 16, 2019 | 6:47 PM

Share

అభినందన్ వర్థమాన్. భారత వాయుసేన పైలట్. శత్రు విమానాలను తరుముతూ వెళ్లి ఆ దేశ సైనికులకు చిక్కినా ఏ మాత్రం బెదరని ధీరుడు. అతని ధైర్య సాహసాలను మెచ్చిన కేంద్రం.. వీర్ చక్ర అవార్డ్ ప్రకటించింది.  ఇక అభినందన్ కు ఎప్పటికప్పుడు సూచనలు చేసిన స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ కు యుద్ధ్ సేవా మెడల్ దక్కింది.

యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ అవార్డు పొందనున్న తొలిమహిళ రక్షణ అధికారి మింటీనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌.. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16ను కూల్చివేయడం తాను చూసినట్లు తెలిపారు. గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందిలో ఒకరైన మింటీ..అభినందన్ కు గైడ్ గా పనిచేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న బాలాకోట్‌ స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపాం. శత్రువుల నుంచి ప్రతిస్పందన వస్తుందేమోనని భావించాం. అందుకు మేం సిద్ధంగా కూడా ఉన్నాం.అపాయం తలపెట్టే దురుద్దేశంతోనే పాక్‌ విమానం భారత గగన తలంలోకి ప్రవేశించింది. కానీ అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం నుంచి గట్టిపోటీ ఎదురయ్యే సరికి వారి మిషన్‌ విఫలమైందని తెలిపారు.

పాకిస్థాన్‌ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించడంతో  ఎఫ్‌-16ను అభినందన్‌ తన మిగ్‌ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్‌ కూడా కూలిపోవడంతో అభినందన్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్‌ సైనికులకు అప్పగించారు. దౌత్య ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్‌ను దాయాది దేశం విడిచిపెట్టింది. శత్రు చెరలో ఉన్నప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ వర్ధమాన్‌కు ‘వీర్‌ చక్ర ప్రకటించారు.