మిల్కా సింగ్ భార్య,, భారత వాలీవాల్ మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ కోవిద్-19 తో కన్ను మూశారు. ఆమె వయస్సు 85 ఏళ్ళు.. గత నెలలో ఆమెకి కోవిద్ పాజిటివ్ సోకగా ఆమెను చండీ గఢ్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చినా ఆమె ఆరోగ్యం విషమించి ఆదివారం మధ్యాహ్నం కన్ను మూశారు. కోవిద్ తో మిల్కా సింగ్ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన తన భార్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్జ్యులు తెలిపారు. నిర్మల్ మిల్కా సింగ్ పంజాబ్ ప్రభుత్వంలో మాజీ స్పోర్ట్స్ డైరెక్టర్ కూడా.. అలాగే భారత మహిళా నేషనల్ వాలీబాల్ టీమ్ కెప్టెన్ గా కూడా ఆమె వ్యవహరించారు. ఆమె మృతికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ సంతాపం తెలిపారు. 1955 లో నిర్మల్ శ్రీలంకకు కూడా వెళ్లి అక్కడ మహిళా వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు .నేషనల్, ఇంటర్నేషనల్ పోటీల్లో ఆమె స్కర్ట్స్ బదులు సల్వార్-కమీజ్ లు ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారట..
కాగా మిల్కా సింగ్ ఆరోగ్యం కుదుట పడుతున్న నేపథ్యంలో ఆయనను కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చునని డాక్టర్లు భావిస్తున్నారు.ఇప్పటికే ఆయన అభిమానులు ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మహా కుంభ్ మేళాలో ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్…..భారీ ఫ్రాడ్.. ..దర్యాఫ్తునకై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశం
బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..