MiG-29 fighter jet: పంటపొలాల్లో కుప్పకూలిన యుద్ధ విమానం..క్షణాల్లో కాలి బూడిద.. పైలట్

ఒక్కసారిగా యుద్ధ విమానం నేల కూలిపోవటంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలు చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం కూలిపోయిన సమయంలో అక్కడ భయంకర శబ్ధాలు వచ్చినట్టుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై

MiG-29 fighter jet: పంటపొలాల్లో కుప్పకూలిన యుద్ధ విమానం..క్షణాల్లో కాలి బూడిద.. పైలట్
Mig 29 Crashes
Follow us

|

Updated on: Nov 04, 2024 | 6:29 PM

భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం కుప్పకూలింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని పంట పొలాల్లో మిగ్‌-29 యుద్ధ విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం పంజాబ్ అదంపూర్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు బయల్దేరిన మిగ్‌ -29 యుద్ధ విమానం ఆగ్రా సమీపంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆగ్రా సమీపానికి చేరుకున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలిసింది. దీంతో పైలట్లు ఏమీ చేయలేని స్థితిలో ఉండగా, విమానం కూలిపోయింది. ఇక్కడ అదృష్టం ఏంటంటే.. అదే క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానం నుండి కిందకు దూకేశారు. దీంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా యుద్ధ విమానం నేల కూలిపోవటంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలు చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం కూలిపోయిన సమయంలో అక్కడ భయంకర శబ్ధాలు వచ్చినట్టుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్రం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

యుద్ధ విమానం కూలిన విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. మిగ్- 29 యుద్ధ విమానాన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. యుద్ధ విమానం కొన్ని నిమిషాల్లోనే మంటల్లో కాలిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..