MEIL: మేఘా ఇంజనీరింగ్ మరో మైలురాయి.. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్‌లో 5 కిమీల టన్నెలింగ్ పూర్తి..

MEIL: మేఘా ఇంజనీరింగ్ మరో మైలురాయి.. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్‌లో 5 కిమీల టన్నెలింగ్ పూర్తి..
Zojila Tunnel

Zojila Tunnel Project: మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ మరో ఘనతను సొంతం చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో

Shaik Madarsaheb

|

Jan 16, 2022 | 9:28 PM

Zojila Tunnel Project: మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ మరో ఘనతను సొంతం చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో ఆల్-వెదర్ జోజిలా టన్నెల్ (Zojila Tunnel Project) నిర్మాణంలో ఎంఈఐఎల్ మరో మైలురాయిని సొంతం చేసుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితిలో.. 14 నెలల రికార్డు సమయంలో 18 కిలోమీటర్ల పొడవైన ఆల్-వెదర్ జోజిలా టన్నెల్స్‌లో నిర్మాణంలో 5-కిమీ పొడవైన టన్నెలింగ్ పనులను పూర్తి చేసి.. ఈ ఘనతను అందుకుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL), మెయిల్ (MEIL) ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ జోజిలా టన్నెల్‌ను.. శ్రీనగర్ – లడఖ్ మధ్య ఏడాది పొడవునా ఎటువంటి అంతరాయాలు లేకుండా కనెక్టివిటీని అందించడానికి నిర్మిస్తున్నారు. జోజిల్లా ప్రధాన సొరంగ మార్గాలను నీల్‌గ్రార్ 1, 2 ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. సగటు సముద్ర మట్టానికి 3,528 మీటర్ల ఎత్తులో మంచు తుఫాను, తీవ్రమైన హిమపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ మెయిల్ సంస్థ వేగంగా ఈ టన్నెల్ పనులను నిర్వహిస్తోంది.

ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గం.. 

జోజిలా సొరంగమార్గం ప్రాజెక్ట్ ఆసియాలో అతి పొడవైనది. దేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టును సవాలుగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. శరవేగంగా నిర్మిస్తోంది. ఈ సందర్భంగా జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ హెడ్ హర్పాల్ సింగ్ మాట్లాడుతూ.. తమ MEIL బృందం అంకితభావం మరియు కష్టపడి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత శీతాకాలంలో జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక హిమపాతం నమోదైంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల సెల్సియస్ (మైనస్ 30 డిగ్రీలు)కి పడిపోయాయి.

అభినందించిన నితిన్ గడ్కరీ

అయితే.. ఈ జొజిలా ప్రాజెక్ట్‌లో మూడు సొరంగాలు, నాలుగు వంతెనలు, మంచు రక్షణ నిర్మాణాలు, కల్వర్టులు, క్యాచ్ డ్యామ్, డిఫ్లెక్టర్ డ్యామ్, కట్ & కవర్ టన్నెల్ లాంటి అనేక ఇంజనీరింగ్ ఫీట్‌లు ఉన్నాయి. అయితే.. గతంలో ఈ ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్ట్‌ను వేగంగా అమలు చేయడంలో MEIL చేసిన కృషిని ప్రశంసించారు. మెయిల్ అత్యంత వేగంగా అత్యధునికంగా ప్రాజెక్టును నిర్మిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్ -లడఖ్‌ల సామాజిక-ఆర్థిక పరిస్థితులను, రవాణా, పర్యాటక రంగాలను మెరుగుపరుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

జోజిల్లా టన్నెల్ ప్రాజెక్ట్ గురించి భారతదేశంలోని ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)అక్టోబర్ 01, 2020న కాశ్మీర్ లోయను లడఖ్‌కు అనుసంధానించే ఆల్-వెదర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ (జోజిలా ప్రాజెక్ట్)ను అందుకొని పనులను ప్రారంభించింది. ప్రాజెక్ట్ మొత్తం పొడవు 32 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించారు.

ఈ ప్రాజెక్ట్ 18 కి.మీ పార్ట్ I. ఇది సోనామార్గ్ – తాల్తాల్‌లను కలుపుతుంది, ప్రధాన వంతెనలు, జంట సొరంగాలు ఉన్నాయి. టన్నెల్ T1లో రెండు ట్యూబ్‌లను నిర్మిస్తున్నారు. యాక్సెస్ రోడ్ల నిర్మాణం తర్వాత, మే 2021 నెలలో MEIL ప్రాజెక్ట్ పనిని ప్రారంభించింది. హిమాలయాల గుండా టన్నెలింగ్ చేయడం ఎల్లప్పుడూ చాలా కష్టమైన పని. అయినప్పటకీ.. MEIL నిర్దిష్ట సమయంలో భద్రత పరంగా.. పూర్తిస్థాయి నాణ్యత, అత్యున్నత ప్రమాణాలతో వేగంగా రెండు సొరంగాలను నిర్మించింది.

జోజిలా మెయిన్ టన్నెల్.. 13.3 కిలోమీటర్ల పొడవునా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. MEIL లడఖ్ నుండి 600 మీటర్లు, కాశ్మీర్ వైపు నుండి 300 మీటర్ల ముందుగానే పూర్తిచేసింది. ప్రాజెక్ట్ పూర్తి పనులు (సెప్టెంబర్ 2026) షెడ్యూల్‌ ప్రకారం పూర్తిచేసేందుకు మెయిల్ (Megha Engineering & Infrastructures Limited) సన్నాహాలు చేసింది.

MEIL గురించి: హైదరాబాద్‌‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) బహుళ రంగాల్లో ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించింది. ఈ కంపెనీ 1989లో స్థాపించారు. గత మూడు దశాబ్దాల్లో 60 దేశాల్లో మెయిల్ తనదైన ముద్ర వేసుకుంది. ఇది నీటిపారుదల, చమురు, గ్యాస్, రవాణా, విద్యుత్, విద్యుత్ వాహనాలు, రక్షణ, తయారీ రంగాలలో సేవలందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం (తెలంగాణ) ను పూర్తి చేయడంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం కీలక పాత్ర పోషించింది.

Also Read:

PM Narendra Modi: దేశం గర్విస్తోంది.. ఏడాది కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Mumbai Bomb Blasts: ముంబై వరుస పేలుళ్ల నిందితుడు సలీం ఘాజీ మృతి.. పాకిస్తాన్ కరాచీలో..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu