ఘోర ప్రమాదం.. బొగ్గు గనిలో భారీ పేలుడు.. 16 మంది దుర్మరణం!

మేఘాలయాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈస్ట్ జయంతియా హిల్స్ జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గురువ జరిగిన భారీ డైనమైట్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఘోర ప్రమాదం.. బొగ్గు గనిలో భారీ పేలుడు.. 16 మంది దుర్మరణం!
Blast In Illegal Coal Mine

Updated on: Feb 05, 2026 | 7:28 PM

మేఘాలయాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈస్ట్ జయంతియా హిల్స్ జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గురువ జరిగిన భారీ డైనమైట్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తూర్పు జయంతియా హిల్స్ ఎస్పీ వికాస్ కుమార్ తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.

ఈస్ట్ జయంతియా హిల్స్ జిల్లాలోని మ్యన్‌సింగ్‌హట్-థాంగ్‌స్కో ప్రాంతంలో అక్రమ బొగ్గు మైనింగ్ కొనసాగుతోంది. ఈ గనిలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. భారీ డైనమైట్ పేలుడు ధాటికి గని ఉన్న కొండ ప్రాంతం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ శిథిలాల కింద చిక్కుకున్న 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం షిల్లాంగ్‌కు తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అదుకున్న పోలీసులు, SDRF, అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం సిబ్బంది తో కలిసి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి బొగ్గు గని కొండ ప్రాంతం పాక్షికంగా కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే థాంగ్స్కొ ప్రాంతంలో గతంలో, 2025 డిసెంబరు 23న కూడా ఇలాంటి డైనమైట్ పేలుడే సంభవించింది. ఆ ప్రమాదంలో ఇద్దరు గని కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వల్ల జరుగుతున్న రెండో పెద్ద ఘటన. ఈఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఈ వరుస ఘటనలు మేఘాలయాలో అక్రమ బొగ్గు మైనింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…