AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Meet: టీడీపీ, జేడీయూకి కేటాయించేది ఆ శాఖలే..! నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతల భేటీ..!

లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్ల సాధించిన భారతీయ జనతా పార్టీ సొంతంగా మేజిక్ ఫిగర్ దాటకపోవడంతో.. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే పక్షాలను ప్రభుత్వంలో భాగం చేసే క్రమంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏయే శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది.

BJP Meet: టీడీపీ, జేడీయూకి కేటాయించేది ఆ శాఖలే..! నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతల భేటీ..!
Jp Nadda Amit Shah Rajnath
Balaraju Goud
|

Updated on: Jun 06, 2024 | 4:39 PM

Share

లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్ల సాధించిన భారతీయ జనతా పార్టీ సొంతంగా మేజిక్ ఫిగర్ దాటకపోవడంతో.. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే పక్షాలను ప్రభుత్వంలో భాగం చేసే క్రమంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏయే శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది.

రేపు (జూన్ 7) ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. ఉదయం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కానున్నారు బీజేపీ పెద్దలు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్డీయే ఎంపీలతో మీటింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్డీయే కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా మోడీని ఎంపీక చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ తోపాటు 23 పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇక రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు కోరనున్నారు. మరోవైపు కూటమిని విస్తరించే అంశంపైనా బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా గెలిచిన స్వతంత్ర ఎంపీలతో పాటు తటస్థ పార్టీలను ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. అమిత్ షా తోపాటు రాజ్‌నాథ్‌సింగ్‌కి ఈ బాధ్యతలు అప్పగించింది బీజేపీ.

ఇక ఆదివారం (జూన్ 9) సాయంత్రం 6 గంటలకు మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు నరేంద్రమోదీ. కేబినెట్‌ కూర్పుపై దృష్టి సారించారు మోదీ. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాఖల కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం. అయితే కీలక శాఖలైన హోంశాఖ, రక్షణశాఖ , ఆర్ధికశాఖ , రైల్వే శాఖ , విదేశాంగ శాఖలను తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలు ఈ శాఖలపై ఎలాంటి ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గవద్దని బీజేపీ నేతలు నిర్ణయించినట్టు సమాచారం.

స్పీకర్‌ పదవిని కూడా మిత్రపక్షాలకు ఇవ్వరాదని బీజేపీ నేతలు నిర్ణయించారు. టీడీపీకి పౌర విమానయానశాఖ , ఉక్కు శాఖ ఇచ్చే అవకాశం ఉంది. గ్రామీణాభివృద్ది శాఖ , పంచాయతీరాజ్‌ శాఖలు జేడీయూకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. శివసేన షిండే వర్గానికి పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉంది. జేడీఎస్‌కు వ్యవసాయశాఖ ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..