
మహారాష్ట్ర బండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 8 మంది దుర్మరణం చెందగా..ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్‌లో ఈ భారీ పేలుడు ఘటనతో పై కప్పు కూలిపోయింది. దీంతో 12 మంది లోపల చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని కాపాడగా.. మిగిలిన 10 మంది కోసం రిస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భారీ సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, ఆంబులెన్స్‌లు ఘటనా స్థలి వద్దకు చేరుకున్నాయి.
జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. అటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది. పేలుడుకు కారణాలు తెలియడం లేదు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన..
महाराष्ट्र के भंडारा में आर्डनेंस फैक्ट्री में धमाका
5 मौतें:
छत ढहने से 12 लोग मलबे में दबे,
2 को बचाया; रेस्क्यू ऑपरेशन जारी#bhandara #ordinancefactory #Maharashtra #Blast #bhandarablast #factoryblast pic.twitter.com/d0SBXhIQ4W— priyanka lathi (@priyankalathi1) January 24, 2025
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ స్పందించారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపించారు.