Mask Vending Machine: మాస్క్‌ వెండింగ్‌ మెషీన్ చూశారా..? 5 రూపాయల నాణెం వేస్తే మాస్క్‌ బయటకు వచ్చేస్తోంది

Mask Vending Machine: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే కరోనాను అంతం చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలని గత ఏడాది నుంచి..

Mask Vending Machine: మాస్క్‌ వెండింగ్‌ మెషీన్ చూశారా..? 5 రూపాయల నాణెం వేస్తే మాస్క్‌ బయటకు వచ్చేస్తోంది
Mask Vending Machine

Updated on: May 11, 2021 | 6:08 AM

Mask Vending Machine: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే కరోనాను అంతం చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలని గత ఏడాది నుంచి ప్రభుత్వాలు, పరిశోధకులు చెబుతూనే ఉన్నారు. కొందరు మాస్క్‌లు ధరించని కారణంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొవాలంటే భౌతిక దూరంతో పాటు మాస్క్‌ తప్పనిసరి అని చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెట్టడంతో కరోనా మరింతగా వ్యాపించేందుకు కారణమవుతోంది. ఇక చాలా రాష్ట్రాల్లో మాస్క్‌ ధరించని వారికి భారీగా జరిమానా విధిస్తున్నారు. మరి కొందరు మాస్క్‌పై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో మాస్క్‌ వినియోగం అనేది పెరిగిపోయింది. ఈ తరుణంలో ప్రయాణికులందరికీ మాస్క్‌ అందుబాటులో ఉండేలా చెన్నైలోని కోయంబేడు బస్టాండులో మాస్క్‌ వెండింగ్‌ మెషీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మెషీన్‌లో 5 రూపాయల నాణెం వేస్తే ఒక డిస్పోజిబుల్‌ మాస్క్‌ బయటకు వస్తుంది. ప్రస్తుతం ఈ మెషీన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేంటో మీరు చూడండి.

కాగా, తమిళనాడులో తీవ్ర స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. ఈ సంపూర్ణ లాక్‌డౌన్‌ సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు అమల్లో ఉండనుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు, ఆదివారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు, పార్క్‌లు, మ్యూజియం తదితరాలకు ప్రజలు వెళ్లేందుకు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో, నిబంధనలు మరింత కఠినతరం చేసేలా 6వ తేదీ నుంచి కూరగాయల మార్కెట్లు, ఇతర చిల్లర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే పనిచేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ జిల్లా కలెక్టర్లు, వైద్యనిపుణులతో చర్చించిన అనంతరం మే 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

ఇవీ కూడా చదవండి:

Maharashtra Corona: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

Modi KCR: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌.. సీఎంను అభినందించిన మోదీ

Coronavirus: దండకారణ్యంలో కరోనా టెర్రర్‌.. మావోయిస్టులను వదలని కరోనా మహమ్మారి.. పోలీసుల బంపర్‌ ఆఫర్‌