ఉనికి కోసం వారి ఆరాటం.. తుడిచిపెట్టేందుకే వీరి పోరాటం.. క్లైమాక్స్‌కు ఆపరేషన్ కగార్?
ఉనికి కోసం వాళ్ల ఆరాటం...తుడిచి పెట్టెయ్యాలని వీళ్ల పోరాటం. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గన్నులు గర్జిస్తున్నాయి. అన్నలు నేలకొరుగుతున్నారు. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్‌కు చేరిందా? 2026, మార్చికల్లా మావోయిస్టుల ఖేల్ ఖతమవుతుందా? వరుస ఘటనలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

ఉనికి కోసం వాళ్ల ఆరాటం…తుడిచి పెట్టెయ్యాలని వీళ్ల పోరాటం. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గన్నులు గర్జిస్తున్నాయి. అన్నలు నేలకొరుగుతున్నారు. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్‌కు చేరిందా? 2026, మార్చికల్లా మావోయిస్టుల ఖేల్ ఖతమవుతుందా? వరుస ఘటనలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
ఆకుపచ్చని అడవులు ఎరుపెక్కుతున్నాయి. గుట్టల నడుమ తుపాకులు గర్జిస్తున్నాయి. ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు పోరాడుతుంటే.. అసలు మావోయిస్టు అనే మాటే లేకుండా చేయాలని ఆపరేషన్ కగార్‌తో కదం తొక్కుతున్నాయి భద్రతా బలగాలు. ఫలితంగా ఎన్‌కౌంటర్ అనే మాట డైలీ వినిపిస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌మడ్ అడవులు ఇన్నాళ్లు మావోయిస్టులకు కీలక స్థావరాలుగా ఉన్నాయి. కానీ అక్కడికి కూడా భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఫలితంగా తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు.
సరిగ్గా వచ్చే ఏడాది మార్చి చివరికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దీనికోసం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటికే 138మంది మావోయిస్టులు హతమయ్యారు. కేవలం 90 రోజుల వ్యవధిలోనే ఇంతమంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించారంటే.. ఆపరేషన్ కగార్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా.. మావోయిస్టుల ఆయువుపట్టుపై సాయుధ బలగాలు గురి చూసి కొడుతున్నాయి. దీంతో మావోయిస్టులు కకావికలమవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. చుట్టూ బలగాలు ఉండటంతో సాధ్యం కావడం లేదు.
ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే ఇప్పటివరకు దాదాపు 250 సీఆర్పీఎఫ్ క్యాంపులను కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి అడవుల్లో ప్రతి 4 కిలోమీటర్లకు ఒక క్యాంపును నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. తాజాగా మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ ఎస్పీ ఎదుట 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
వీడియో చూడండి..
2026, మార్చి చివరికల్లా దేశంలో మావోయిస్టుల ఏరివేత పూర్తవుతుందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన ఏప్రిల్ 4,5 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. దంతెవాడలో భద్రతా బలగాలతో భేటీ అవుతారు. మావోయిస్టుల ఏరివేతపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆపరేషన్ కగార్, మరింత ఉధృతమవుతుందని భావిస్తున్నారు.
Another strike on Naxalism!
Our security agencies have neutralised 16 Naxalites and recovered a massive cache of automatic weapons in an operation in Sukma.
Under the leadership of PM Shri @narendramodi Ji, we are resolved to eradicate Naxalism before the 31st of March 2026.…
— Amit Shah (@AmitShah) March 29, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




