Elephant Hulchul: తమిళనాడులో ఏనుగుల బీభత్సం.. సెల్ఫీ తీసుకోబోయి ఒకరు మృతి.. పలువురికి గాయాలు

|

Mar 15, 2023 | 6:38 AM

తమిళనాడులో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. హైవేపై వెళ్తున్న వాహనాలను ద్వంసం చేశాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Elephant Hulchul: తమిళనాడులో ఏనుగుల బీభత్సం.. సెల్ఫీ తీసుకోబోయి ఒకరు మృతి.. పలువురికి గాయాలు
Elephants Hulchul
Follow us on

తమిళనాడు క్రిష్ణగిరి జిల్లాలో గత రెండు రోజులుగా ఏనుగుల బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మరోవైపు బెంగళూరు హైవేపై వాహనాలపైకి దూసుకెళ్లాయి. రెండు రోజులుగా క్రిష్ణగిరి, ధర్మపురి అటవీ ప్రాంతాల్లోని గ్రామాలలో ఒక్కసారిగా కలకలం రేపాయి. గ్రామాల్లో కనిపించిన వాటిని ద్వంసం చేసుకుంటూ పోయాయి ఏనుగులు. గజరాజుల రాకతో భయాందోళనకు గురైన స్తానికులు అడవిలోకి తరిమికొట్టడానికి ప్రయత్నించారు. మరోవైపు ఏనుగులని వీడియోలు తీయడానికి ప్రయత్నించిన వ్యక్తి , ఒక్కసారిగా ఏనుగు దాడి చేయడం తో అక్కడిక్కడే మృతి చెందాడు.

మరోవైపు బెంగళూరు హైవే పై వీరంగం సృష్టించాయి. హైవేపై వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లాయి ఏనుగులు. అడ్డొచ్చిన కారు పై దాడి దాడి చేశాయి. దీంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ డ్రైవర్ ను క్రిష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఏనుగుల సంచారంతో ప్రాణాలను గుప్పెట్లో ఉంచుకొని ప్రయాణం చేయవలసి వస్తోందని అన్నారు స్తానికులు. రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్పిస్తున్నాయని, అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టి రోడ్డు పక్కన ముళ్లకంచెలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు క్రిష్ణగిరి, ధర్మపురి అటవీ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..