సీఎం మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా వేదికపైకి బిడ్డను విసిరేసిన తండ్రి.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

|

May 17, 2023 | 10:46 AM

ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు ఓ తండ్రి చేసిన పనికి అక్కడున్నవారందరూ అవాక్కయ్యారు. కేవలం ఏడాది వయసున్న పాపను తన తండ్రి సీఎం ఉన్న వేదికపైకి విసిరేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్‌లోని ముకేశ్ పటేల్ తన భార్య నేహతో కలిసి ఉంటున్నారు.

సీఎం మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా వేదికపైకి బిడ్డను విసిరేసిన తండ్రి.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Baby
Follow us on

ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు ఓ తండ్రి చేసిన పనికి అక్కడున్నవారందరూ అవాక్కయ్యారు. కేవలం ఏడాది వయసున్న పాపను తన తండ్రి సీఎం ఉన్న వేదికపైకి విసిరేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్‌లోని ముకేశ్ పటేల్ తన భార్య నేహతో కలిసి ఉంటున్నారు. ఈ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. అయితే ఈ చిన్నారికి మూడు నెలల వయసున్నప్పుడే గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ముకేశ్, నేహాలు వైద్య ఖర్చులు పెట్టేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. వారి ఆర్థిక స్తోమతకు మించి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు.

ఇటీవల ఆ చిన్నారికి శస్త్ర చికిత్స చేసేందుకు మరో రూ.3.50 లక్షలు కావాలని వైద్యులు తెలిపారు. దీంతో డబ్బు ఎలా సమకూర్చాలో ఆ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అయితే ఆ సమయంలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ .. సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ సభకు హాజరయ్యారు. అక్కడికి ముకేశ్, నేహ కూడా తమ కొడుకుని తీసుకొని వెళ్లారు. సీఎం దగ్గరకు వెళ్లి తమ సమస్యను చెప్పుకోవాలనుకున్నా అది సాధ్యపడలేదు. దీంతో చేసేదేమి లేక ఎలాగైనా సీఎం దృష్టి తమపై పడాలని అనుకున్నాడు. ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ముకేశ్ తన కొడుకును వేదికపైకి విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాబును కాపాడి తల్లికి అప్పగించారు. మొదట విస్తుపోయినప్పటి చిన్నారి సమస్యను సీఎం తెలుసుకున్నారు. ఆ చిన్నారికి వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.