బెంగళూరును టెక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే వినూత్న వాహనాలు, కాన్సెప్ట్‌లు బెంగళూరు పట్టణ వీధుల్లో ప్రతిరోజూ కనిపిస్తుంటాయి. ఇది సుస్థిరమైన రవాణా విధానం, కష్టతరమైన పని చేసే తెలివితేటలకు ప్రసిద్ధి. తాజాగా టెక్ సిటీ బెంగళూర్‌లో ఇన్నోవేటివ్ వెహికల్ వాహనదారుల దృష్టిని ఆకర్షించింది. నగర రోడ్లపై దూసుకెళుతున్న ఈ వెహికల్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ అనే నెటిజన్ ఈ వాహనం వీడియో, ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోలో ఒకే సీటు కలిగిన మూడు చక్రాల వాహనం బెంగళూర్ రోడ్లపై దూసుకెళుతుండటం కనిపించింది. వెలోమొబైల్ అని పిలిచే ఈ వాహనం యజమాని ఫణీష్ నాగరాజ అని తెలిసింది. జేపీనగర్‌లో ఈ వాహనదారుడిని కలిశాను..నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న హ్యూమన్ పవర్డ్ వెహికల్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇది సాధారణ సైకిల్ తరహాలో ఉంటుందని, దీనికి పవర్ అసిస్టెన్స్, కన్వర్షన్ ఉండవని ఓ ట్వీట్‌కు బదులిస్తూ నాగరాజ వివరించారు.
Now this is some @peakbengaluru stuff. Met this guy near JP Nagar. Human powered vehicle from Netherlands. pic.twitter.com/r1whYjPQlX
— Revanth (@RevanthD18) January 22, 2023
ఈ వాహనంపై ప్రజలు తీవ్రంగా స్పందించారు. వీడియోని పదే పదే ఆసక్తిగా తిలకించారు. ఏదో ఒక రోజు తాము కూడా ఈ వాహనాన్ని నడుపుతామని పలువురు నెటిజన్లు కామెంట్ ఆశపడుతూ కామెంట్ చేశారు. అయితే, మన స్థానిక రోడ్లపై ఈ వాహనం ఎంతవరకు ప్రయాణించగలదన్నదనిది మాత్రం సర్వత్రా సందేహం వ్యక్తం చేస్తున్నారు.