Bengaluru Floods: మెట్రో నగరాల్లో ల్యాప్‌టాప్‌తో ఇంటి నుండి, కేఫ్‌ల నుండి పని చేసే వ్యక్తులను మనం తరచుగా చూస్తాం. కానీ, భారీ వర్షాలు, వరదల కారణంగా బెంగళూరులో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఉద్యోగి ఏకంగా డెస్క్‌టాప్‌పూ కేఫ్‌లోకి తీసుకెళ్లవలసి వచ్చింది! ఇటీవల బెంగళూరులో సంభవించిన భారీ వరదల కారణంగా అతడు డెస్క్‌టాప్ వెంటబెట్టుకుని కాఫీ షాప్‌లో ఆఫీస్ సెటప్ అమర్చుకున్నాడు. అతన్ని స్థానికులు కొందరు ఫోటోలు,వీడియోలు తీసి సోషల్ మీడయాలో షేర్ చేయడంతో చిత్రం వైరల్‌గా మారింది. ట్విట్టర్ యూజర్ సంకేత్ సాహు షేర్ చేసిన ఈ ఫోటోలో డెస్క్‌టాప్‌పై పని చేస్తున్న వ్యక్తి ముందు..మానిటర్, CPU, మౌస్‌తో సహా ఆఫీస్ వర్క్ చేయటానికి అవసరమైన అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. థర్డ్ వేవ్ తర్వాత కాఫీ షాప్‌లో కనిపించిన వర్క్‌ఫ్రం హోం డెస్క్‌టాప్ సెటప్ ఇది అంటూ అతడు ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే బెంగళూరులో ఇప్పుడు అనేక ఐటీ కంపెనీలు వరదల్లో మునిగితేలుతున్నాయి.
ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. నెటిజన్లకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇలాంటి వ్యవహారాలు వ్యవస్థలకు అంత మంచిది కాదంటున్నారు. ఇది పని సంస్కృతిని విషపూరితంగా మార్చేస్తుందటూ విమర్శలు చేస్తున్నారు. “ల్యాప్‌టాప్‌తో పాటు మానిటర్‌ను ఎక్స్‌టర్నల్ స్క్రీన్‌గా ఉపయోగించినట్లయితే ఇది అర్థమయ్యేది.. కానీ మనిషి అతను మొత్తం CPU సెటప్‌తో వెళ్లటం ఎందుకని మరో నెటిజన్ ప్రశ్నిస్తున్నాడు.
I just saw a group working from the Third Wave Coffee with “a full-fledged desktop setup” because their offices are flooded ?@peakbengaluru pic.twitter.com/35ooB1TOqU
— Sanket Sahu (@sanketsahu) September 7, 2022
ఇందులో “వింత ఏమీ లేదు. అనేక సందర్బాల్లో నేను కూడా కాఫీ షాప్‌లో పని చేస్తాను. ఈ దుకాణాలు కొంచెం ప్రీమియం. కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఇలాంటి కేఫ్‌లు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. మీరు వాటిని చూసిఉండరు..! అందుకే వింతగా భావిస్తున్నారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి