కరోనా కాలం.. మమత దూకుడు రాజకీయం.. మోదీకే లాభం

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధన్ కర్ కి మధ్య మళ్ళీ విభేదాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ అమలును  పరిశీలించడానికి వఛ్చిన కేంద్ర బృందాలకు మమత...

కరోనా కాలం.. మమత దూకుడు రాజకీయం.. మోదీకే లాభం

Edited By:

Updated on: May 05, 2020 | 12:51 PM

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధన్ కర్ కి మధ్య మళ్ళీ విభేదాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ అమలును  పరిశీలించడానికి వఛ్చిన కేంద్ర బృందాలకు మమత ప్రభుత్వం సరిగా సహకరించకపోవడం, వారితో రాష్ట్ర అధికారులు అంటీముట్టనట్టు వ్యవహరించడంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం, దానిపై దీదీ కౌంటర్ ఇవ్వడం ఇద్దరి మధ్యా దూరాన్ని మరింత పెంచాయి. వచ్ఛే ఏడాది ఆరంభంలో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మమతా బెనర్జీ మాత్రం తన తీరు మార్చుకోలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో, ప్రధాని మోదీతో ‘ఘర్షణాత్మక వైఖరి ‘ నే పాటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఆమె ప్రభుత్వ పాలనాతీరు కేంద్రంతో ఢీ కొట్టే మాదిరే కనిపిస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకవైపు లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ, స్వీట్, పాన్, పూల మార్కెట్లను తెరవాలన్న మమత ప్రభుత్వ ఆదేశాలపై బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. లాక్ డౌన్ పై కేంద్రానిదే తుది నిర్ణయమంటూనే..ఆమె..  దీన్ని పూర్తిగా నీరుగారుస్తూ.. రాష్ట్రంలో అనేక చోట్ల సడలింపులకు అనుమతులిచ్చేశారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో దీదీ.. ఇప్పటికిప్పుడు తన పంథా మార్చుకునే దిశలో లేరని తెలుస్తోంది.