Mamata Banarjee: ఇప్పటివరకు నా పార్టీ నేతలు.. ఇప్పడు నా కుటంబంపై పడ్డారు.. బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం

|

May 20, 2023 | 4:41 AM

పశ్చిమ  బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ బీజేపీపై విమర్శలు చేశారు. ఇప్పటిదాకా తన పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు కొనసాగించిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు.

Mamata Banarjee: ఇప్పటివరకు నా పార్టీ నేతలు.. ఇప్పడు నా కుటంబంపై పడ్డారు.. బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం
Mamata Banerjee
Image Credit source: TV9 Telugu
Follow us on

పశ్చిమ  బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ బీజేపీపై విమర్శలు చేశారు. ఇప్పటిదాకా తన పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు కొనసాగించిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే పార్టీ జనరల్‌ సెక్రెటరీ, తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి సీబీఐ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. బంకురాలో నిర్వహించిన పార్టీ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొని మమతాబెనర్జీ ఈ విషయాలు వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణం కేసులో శనివారం కోల్‌కతా నిజాం ప్యాలస్‌లోని కార్యాలయానికి విచారణకు హాజరు కావాంటూ అభిషేక్‌ బెనర్జీకి సీబీఐ నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో బంకురా పర్యటనలో ఉన్న అభిషేక్‌ వెంటనే కోల్‌కతాకు పయనమయ్యారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ వర్చువల్‌గా మాట్లాడారు. మా పార్టీలోని నేతలందరిపై దర్యాప్తు సంస్థల దాడులు పూర్తయ్యాయని.. ఇప్పుడు బీజేపీ దృష్టి నా కుటుంబంపై పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా భయపడేది లేదని.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో నోటీసులు జారీ చేయించడం తప్ప బీజేపీ ఇంకేం చేయగలదు ప్రశ్నించారు. తృణమూల్‌ చేపట్టిన యాత్ర విజయవంతమవుతుందనే భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీని ఓడించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు దీదీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం