ప్రెస్ ఫ్రీడమ్ రోజున జర్నలిస్టులకు మమత భారీ నజరానా

కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వారియర్లకు, జర్నలిస్టులకు పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. వీరికి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ని వర్తింపజేస్తామని మమత వెల్లడించారు. పత్రికా రంగ స్వేఛ్చా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నామని...

ప్రెస్ ఫ్రీడమ్ రోజున జర్నలిస్టులకు మమత భారీ నజరానా

Edited By:

Updated on: May 03, 2020 | 5:49 PM

కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వారియర్లకు, జర్నలిస్టులకు పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. వీరికి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ని వర్తింపజేస్తామని మమత వెల్లడించారు. పత్రికా రంగ స్వేఛ్చా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నామని, ప్రజాస్వామ్యంలో నాలుగో మూల స్తంభమైన జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంటున్నదని ఆమె చెప్పారు. నిర్భయంగా విధి నిర్వహణ చేసే పాత్రికేయులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడుతూ ఆమె.. వారి పట్ల తమకెంతో గౌరవం ఉందన్నారు. అలాగే కరోనా రోగులకు నిర్విరామంగా చికిత్సలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు కూడా అమోఘమన్నారు.