Parking Fees: పార్కింగ్‌ ఫీజు వసూలు చేసే హక్కు షాపింగ్‌ మాల్‌కు లేదు: హైకోర్టు

|

Jan 15, 2022 | 9:47 PM

Parking Fees: పార్కింగ్ ఫీజు వసూలు చేసే హక్కు మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. లులు ఇంటర్నేషనల్ షాపింగ్..

Parking Fees: పార్కింగ్‌ ఫీజు వసూలు చేసే హక్కు షాపింగ్‌ మాల్‌కు లేదు: హైకోర్టు
Follow us on

Parking Fees: పార్కింగ్ ఫీజు వసూలు చేసే హక్కు మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కలమస్సేరి మున్సిపాలిటీని కోర్టు ప్రశ్నించింది. మాల్‌ వినియోగదారుల నుంచి అక్రమంగా పార్కింగ్‌ రుసుమును వసూలు చేస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ విచారణ చేపట్టారు. అయితే, వసూళ్లను నిలిపివేయాలని మాల్‌ను కోరలేదని, అది వారి స్వంత పూచీతో ఉంటుందని కోర్టు తెలిపింది.

భవన నిర్మాణ నిబంధనల ప్రకారం.. భవనాన్ని నిర్మించాలంటే పార్కింగ్‌కు సరిపడా స్థలం అవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పార్కింగ్ స్థలం భవనంలో భాగమేనని కోర్టు తెలిపింది. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతుతో భవన నిర్మాణ అనుమతి ఇస్తారు. ఈ అండర్ టేకింగ్ ఆధారంగానే భవనం నిర్మిస్తారు. భవనం నిర్మించిన తర్వాత, భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయవచ్చా లేదా అనేది ప్రశ్న. ఇది సాధ్యం కాదనే అభిప్రాయాన్ని కోర్టు పేర్కొంది.

తదుపరి విచారణ జనవరి 28న
మున్సిపాలిటీ తన వైఖరిపై ప్రకటన దాఖలు చేయాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను జనవరి 28కి వాయిదా వేసింది. వినియోగదారులకు ఉచిత పార్కింగ్‌ కల్పించాల్సిన బాధ్యత మాల్‌ యాజమాన్యానిదేనని పిటిషనర్ పాలీ వడక్కన్ తెలిపాడు. పార్కింగ్ ఫీజుగా రూ.20 వసూలు చేయడంతో వడక్కన్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 2న మాల్‌కు వెళ్లారు. మొదట్లో డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మాల్ సిబ్బంది ఎగ్జిట్ గేటుకు తాళం వేసి బెదిరించారని ఆయన ఆరోపించాడు. పార్కింగ్ ఏరియా కమర్షియల్ కాంప్లెక్స్ అని వాదించారు. ఇది పబ్లిక్ ప్లేస్, ఇది కస్టమర్ల కోసం సిద్ధం చేయబడింది. ఇందుకోసం లులు మాల్‌ పార్కింగ్‌ రుసుము వసూలు చేయరాదని ఆయన పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ వాదనను మాల్ లాయర్ వ్యతిరేకించారు. మాల్‌కు లైసెన్స్ ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Covid 19 Insurance: మీకు కరోనా వచ్చిందా..? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!

Maruti Suzuki: వాహనదారులకు షాకిచ్చిన మారుతి సుజుకి.. పెరిగిన కార్ల ధరలు.. ఎంత అంటే..!