Maharashtra Political Crisis: ఇదిగో మా బలం.. వీడియో విడుదల చేసిన శివసేన రెబల్‌ ఏక్‌నాథ్‌షిండే ..

| Edited By: Ram Naramaneni

Jun 23, 2022 | 5:40 PM

Eknath Shinde Camp Releases Video: శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలతోమ బలప్రదర్శన చేశారు ఏక్‌నాథ్‌షిండే . తనకు 42 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కొత్త వీడియో విడుదల చేశారు. షిండే. తనదే అసలైన శివసేన అంటున్నారు ఏక్‌నాథ్‌షిండే.

Maharashtra Political Crisis: ఇదిగో మా బలం.. వీడియో విడుదల చేసిన శివసేన రెబల్‌ ఏక్‌నాథ్‌షిండే ..
Eknath Shinde Camp Releases
Follow us on

మహారాష్ట్రలో పొలిటికల్‌ చెస్‌ మరింత రంజుగా మారింది. ఉద్దవ్‌ వర్సెస్‌ షిండే రాజకీయ ఎత్తుగడలతో.. గంటగంటకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌహతి క్యాంప్‌లో ఉన్న 24 మంది ఎమ్మెల్యేలతో తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వాళ్లతో ఉద్ధవ్‌థాక్రే నేరుగా చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ బానిసలుగా చూస్తోందని ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేలంతా కోరుకుంటే మహా వికాస్‌ అఘాడి కూటమి నుంచి బయటకు రావడానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా ముంబైకి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు సంజయ్‌రౌత్‌. అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహిస్తే తప్పకుండా ఉద్ధవ్‌ థాక్రే విజయం సాధిస్తారని అన్నారు.

గౌహతి హోటల్లో బస చేసిన శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలతోమ బలప్రదర్శన చేశారు ఏక్‌నాథ్‌షిండే . తనకు 42 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కొత్త వీడియో విడుదల చేశారు. షిండే. తనదే అసలైన శివసేన అంటున్నారు ఏక్‌నాథ్‌షిండే. తమను అసలైన శివసేనగా గుర్తించాలని గవర్నర్‌ , ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని అంటున్నారు షిండే
ఎమ్మెల్యేలతో హోటళ్లో షిండే కూర్చున్న వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇదే సమయంలో ముంబైలో సీఎం నివాసంలో కూడా శివసేన ఎమ్మెల్యేల భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి కేవలం ఆదిత్యా థాక్రేతో సహా 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.

అసెంబ్లీ ప్రస్తుత పరిస్థితి ఇది..

శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే ఇటీవల మరణించడంతో మహారాష్ట్ర శాసనసభలో ప్రస్తుత బలం 287. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మెజారిటీకి 144 సంఖ్య అవసరం. మహా వికాస్ అఘాడీకి 169 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇందులో శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది ఉన్నారు. బీజేపీ కూటమికి 113 మంది ఎమ్మెల్యేలు ఉండగాఇందులో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన 13 మంది స్వతంత్రులు.