ఆర్‌ఏ స్టూడియోలో పిల్లలను బంధించిన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో మృతి
ముంబైలోని పోవై ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో 20 మంది పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్య పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. పిల్లలందరినీ సురక్షితంగా రక్షించారు. పోలీసులు వారిని ఒక్కొక్కరిగా భవనం నుండి కిందకు తీసుకువచ్చారు. అంతుకుముందు నిందితుడు ఈ సంఘటనను వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు.

ముంబైలోని పోవై ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో 20 మంది పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్య పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. పిల్లలందరినీ సురక్షితంగా రక్షించారు. పోలీసులు వారిని ఒక్కొక్కరిగా భవనం నుండి కిందకు తీసుకువచ్చారు. గురువారం (అక్టోబర్ 30), రోహిత్ ఆర్య ఆడిషన్ల కోసం వచ్చిన 100 మంది పిల్లలలో 17 మందిని స్టూడియో లోపల బందీలుగా తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతను ఈ సంఘటనను వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు.
ముంబైలోని పోవైలో 17 మంది పిల్లలను బందీలుగా ఉంచిన రోహిత్ ఆర్య చికిత్స పొందుతూ మరణించాడు. పిల్లలను రక్షించేందుకు వెళ్లిన పోలీసులపై రోహిత్ కాల్పులు జరిపాడు. పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడని పోలీసులు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం ముంబైలోని పోవై ప్రాంతంలోని ఎల్ అండ్ టి భవనం సమీపంలోని ఆర్ఏ స్టూడియోలో గంటకు పైగా నాటకీయ పరిస్థితి నెలకొంది. 15 ఏళ్ల వయసున్న అబ్బాయిలు, అమ్మాయిలను ఆడిషన్ కోసం పిలిచారు. ఆ తర్వాత వారి బందీలుగా తీసుకున్న రోహిత్ ఆర్య బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశాడు. తాను కొంతమందితో మాట్లాడాలని, వారిని ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నానని, తనకు డబ్బు అవసరం లేదని పేర్కొన్నాడు. అలా చేయడానికి అనుమతి లేకపోతే స్టూడియోను తగలబెడతానని ఆర్య బెదిరించాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




