AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరి హృదయాలను గెలుచుకున్న వధువు గ్రాండ్ ఎంట్రీ.. మీరూ చూస్తే షాకవ్వాల్సిందే!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకలకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తారు. అది అలంకరణలు అయినా, దుస్తులు అయినా లేదా ప్రవేశ శైలి అయినా..! అలాంటి వివాహ వీడియోలు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

అందరి హృదయాలను గెలుచుకున్న వధువు గ్రాండ్ ఎంట్రీ.. మీరూ చూస్తే షాకవ్వాల్సిందే!
Bride Wedding Entry
Balaraju Goud
|

Updated on: Oct 30, 2025 | 6:48 PM

Share

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకలకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తారు. అది అలంకరణలు అయినా, దుస్తులు అయినా లేదా ప్రవేశ శైలి అయినా..! అలాంటి వివాహ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వరుడి ఆకట్టుకునే ప్రవేశాన్ని, కొన్నిసార్లు వధువు డాన్స్‌తో ఎంట్రీ సీన్లకు సంబంధించిన దృశ్యాలు తెగ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో వధువు ఆనందం, భావ వ్యక్తీకరణ అందరినీ నవ్విస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ manozbnasalofficial_01లో షేర్ చేయడంతో కొద్ది సమయంలోనే వేలాది మంది వీక్షించారు. ఈ వీడియోలో వధువు గ్రాండ్ ఎంట్రీతో మొదలైంది. ఆమె అందంగా అలంకరించుకుని వివాహ వేదిక వద్దకు చేరుకోగానే, అందరి దృష్టి ఆమెపైనే ఉంది. కానీ వధువు తన వరుడిపై దృష్టి పెట్టినట్లుంది. అతన్ని ఆకట్టుకునేందుకు డాన్స్ తో మైమరిపించింది.

వరుడిని చూసిన వధువు ఆనందానికి అవధులు లేవు. ఆమె ముఖంలో చిరునవ్వు, కళ్ళలో మెరుపు, హృదయంలో ఉత్సాహం. వీటన్నిటి ప్రభావంతో ఆమె అతను వచ్చినప్పుడు డాన్స్ చేయకుండా ఉండలేకపోయింది. “పాల్కి” పాట ప్లే అయిన వెంటనే, వధువు పారవశ్యంలో మునిగిపోయి ఎంతో ఉత్సాహంతో డాన్స్ చేయడం ప్రారంభించింది. ఆమె అందమైన డాన్స్ చూసి, అందరూ చప్పట్లు కొట్టి, ఆమె మధురమైన ఆనందానికి ఆశ్చర్యపోయారు.

వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..