క్యాబ్‌ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ.. ఐపీఎస్ సంచలన నిర్ణయం..

| Edited By:

Dec 12, 2019 | 1:13 PM

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ బిల్లు ఆమోదంపై మిశ్రమ స్పందన వెలువడుతోంది. ఇది రాజ్యాగ స్పూర్తికి విరుద్ధమంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు, విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రకి చెందిన అబ్దుర్‌ రహమాన్‌ అనే ఐపీఎస్ ఆఫీసర్‌ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రహమాన్‌ ప్రస్తుతం ముంబైలో […]

క్యాబ్‌ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ.. ఐపీఎస్ సంచలన నిర్ణయం..
Follow us on

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ బిల్లు ఆమోదంపై మిశ్రమ స్పందన వెలువడుతోంది. ఇది రాజ్యాగ స్పూర్తికి విరుద్ధమంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు, విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రకి చెందిన అబ్దుర్‌ రహమాన్‌ అనే ఐపీఎస్ ఆఫీసర్‌ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రహమాన్‌ ప్రస్తుతం ముంబైలో విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం రాజ్యసభలో క్యాబ్2019 కు ఆమోదం లభించడంతో రహమాన్ అసహనం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పౌరసత్వ సవరణ బిల్లు2019.. పూర్తిగా రాజ్యాంగ ప్రాథమిక లక్షణానికి వ్యతిరేకంగా ఉందంటూ పేర్కొన్నారు. పౌరుల హక్కులకు ఆటంకం కల్గించేలా ఉన్న ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నాని.. అందుకే.. నా ఉద్యోగాన్ని వదిలేస్తున్నానంటూ ట్విట్టర్‌ పోస్ట్‌లో వెల్లడించారు.