మహిళలపై మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో శక్తి బిల్లు
ఎందరో మహిళలు, చిన్నారులు హింసకు గురవుతున్నారు. దానిని అదుపు చేసేందుకు మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీలో శక్తి బిల్లును ప్రవేశపెట్టింది.
ఎందరో మహిళలు, చిన్నారులు హింసకు గురవుతున్నారు. దానిని అదుపు చేసేందుకు మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీలో శక్తి బిల్లును ప్రవేశపెట్టింది. దిశ చట్టం తరహాలో శక్తి బిల్లును రూపొందించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచార ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం అయ్యారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించాలని ఆందోళనలు ఉధృతం అయ్యారు. ఈ నేపథ్యంలో ఐపీసీలో కొన్ని మార్పులు చేస్తూ మహిళల పట్ల నేరాలకు పాల్పడినవారికి కఠిన శిక్షలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే దిశ చట్టం తరహాలో రూపొందించిన ఈ శక్తి బిల్లు పట్ల మహారాష్ట్రలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో శక్తి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఇటీల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. 2019లో ఏపీలో తయారు చేసిన దిశ చట్టంలో రేప్ నిందితులకు మరణ శిక్షను విధించారు.అయితే ఆ తరహాలోనే శక్తి బిల్లును రూపొందించినట్లు ఇటీవల సీఎం తెలిపారు. మహిళా హక్కుల న్యాయవాదులు, కార్యకర్తలు, ప్రొఫెసర్లు ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టవద్దని సీఎంను కోరారు.బిల్లు దారుణంగా ఉందని, బిల్లు రూపకల్పనకు ముందు తమను సంప్రదించాల్సి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ శక్తి బిల్లు ప్రకారం.. అత్యాచారానికి పాల్పడిన వారికి మరణ శిక్ష లేదా 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష అమలు చేయనున్నారు. కాగా, మహిళల పట్ల నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది.