Overseas tour: ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఝలక్ ఇచ్చిన సర్కార్.. ఇక నుంచి ఆ విషయాలు చెప్పాల్సిందే..

|

Feb 05, 2021 | 4:16 AM

Overseas tour: ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సహా ఉన్నతాధికారులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అధికారుల విదేశీ పర్యటనను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

Overseas tour: ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఝలక్ ఇచ్చిన సర్కార్.. ఇక నుంచి ఆ విషయాలు చెప్పాల్సిందే..
Follow us on

Overseas tour: ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సహా ఉన్నతాధికారులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అధికారుల విదేశీ పర్యటనను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మార్గదర్శకాలను ‘మహా’ సర్కార్ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులు ప్రతి ఏటా మూడు విదేశీ టూర్లు మాత్రమే చేపట్టేందుకు అనుమతించారు. ఈ పర్యటన కాల పరిమితిని 15 రోజులకు కుదించారు. అంతేకాదు.. ప్రభుత్వం తరఫున విదేశీ పర్యటనకు వెళ్లే అధికారులు.. తమ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో వివరించాలని స్పష్టం చేసింది. ఆ వివరాలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదిస్తేనే అధికారులకు విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా, అధికారులు తమ స్వప్రయోజనాలు లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే విదేశీ టూర్లకు వెళ్లాలని భావించిన మమారాష్ట్ర సర్కార్.. ఈ విధమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గదర్శకాలపై అధికార వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Also read:

Covaxin: వారికే కొవాగ్జిన్ టీకా.. ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ వైద్య అధికారులు..

ఇంగ్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి, నేటి నుంచే టెస్ట్‌ సిరీస్‌ మొదలు.. మరో ప్రతిష్టాత్మక టోర్నీకి టీమిండియా సిద్ధం