Corona In Maharashtra: కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాక్షికంగా లాక్‌డౌన్‌..

|

Apr 04, 2021 | 6:13 PM

Corona In Maharashtra: కరోనా కేసులు మహారాష్ట్రాను వణికిస్తోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండడం భయానోందళనలకు గురి చేస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి...

Corona In Maharashtra: కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాక్షికంగా లాక్‌డౌన్‌..
Lockdown In Maharastra
Follow us on

Corona In Maharashtra: కరోనా కేసులు మహారాష్ట్రాను వణికిస్తోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండడం భయానోందళనలకు గురి చేస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు సంఖ్య మాత్రం తగ్గడంలేదు.
దీంతో ఎలాగైనా కరోనాను కట్టడి చేయాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతకొన్ని రోజులుగా మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధిస్తారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా సర్కారు అదే దారిలో అడుగులు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాక్షికంగా లాక్‌డౌన్‌ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా హాళ్లు, పార్కులు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు మూసువేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పార్శిళ్లకు మాత్రం అనుతిచ్చారు. రేపు రాత్రి నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానున్నారు. ఇక శని,ఆది వారాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్రంలో కొత్తగా 49,447 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 277 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,53,523 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 55,656 కి చేరింది. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.

Also Read: Lovely Virtual Guest: చిన్నారులతో కలిసి ఈస్టర్ లంచ్‌.. అక్కతో వీడియోకాల్.. కేరళ ప్రచారంలో రాహుల్ దూకుడు..

BSNL New Offer: దూకుడు పెంచుతోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌… ఎయిర్‌ టెల్‌, జియో కంటే మెరుగైన ఆఫర్‌.. రూ.108 రీచార్జ్‌తో..

Covid19 Vaccine: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వయసుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ కోవిడ్ వ్యాక్సిన్..