Maharastra: స్మశానంలో తేనెటీగల దాడి.. PPE కిట్స్ ధరించి మరీ అంత్యక్రియలు చేసిన కుటుంబం

|

Jun 14, 2024 | 7:13 PM

పీఈ కిట్స్ ను ఉపయోగించి తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవచ్చు అని .. స్మశానంలో అంత్యక్రియలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయవచ్చు అని నిరూపించింది  ఒక  ఫ్యామిలీ.. ఈ వింత ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలోని కుటుంబ సభ్యులు స్మశానంలో తమ కుటుంబ పెద్ద దహన సంస్కారాలను ప్రారంభించింది. హఠాత్తుగా  తేనెటీగలు ఆ కుటుంబ సభ్యులపై దాడి చేశాయి.

Maharastra: స్మశానంలో తేనెటీగల దాడి.. PPE కిట్స్ ధరించి మరీ అంత్యక్రియలు చేసిన కుటుంబం
Family Performs Cremation
Follow us on

పీపీఈ కిట్స్ ధరించి వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు చికిత్స అందిస్తారనే ఇప్పటి వరకూ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత పీపీఈ కిట్స్ ఉపయోగం ప్రతి ఒక్కరికీ తెలిసిందని చెప్పవచ్చు. అయితే ఈ పీపీఈ కిట్స్ ను ఉపయోగించి తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవచ్చు అని .. స్మశానంలో అంత్యక్రియలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయవచ్చు అని నిరూపించింది  ఒక  ఫ్యామిలీ.. ఈ వింత ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలోని కుటుంబ సభ్యులు స్మశానంలో తమ కుటుంబ సభ్యుడి  దహన సంస్కారాలను ప్రారంభించింది. హఠాత్తుగా  తేనెటీగలు ఆ కుటుంబ సభ్యులపై దాడి చేశాయి. దీంతో వారు పీపీఈ కిట్‌లు ధరించి తమ పెద్ద అంత్యక్రియలను పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.

గురువారం వైభవ్‌వాడి తాలూకాలోని తితవలి గ్రామంలోని 70 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించాడు. వృద్ధ  రైతుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, మరికొందరు స్థానికులు గ్రామ శివారులో ఉన్న స్మశానంలో చేరుకున్నారు. అయితే వీరిపై  తేనెటీగలు  దాడి చేయడం ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి

స్మశానం దగ్గర కలపను కాల్చడం వల్ల పొగ వెలువడిందని.. ఈ పొగ కారణంగా తేనెటీగలు రెచ్చిపోయి అక్కడ ఉన్న వారిపై దాడి చేయడం మొదలు పెట్టినట్లు గ్రామస్థుడు తెలిపారు.

కొంతమంది గ్రామస్తులను తేనే తీగలు కుట్టాయి కూడా.. ఇలా తేనెటీగల దాడి కొనసాగుతుండడంతో ఎవరైనా సమీపంలోని ఉంబార్దిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళారు. అక్కడ నుంచి వారు ఐదు వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) కిట్‌లను సేకరించారు.

అలా వృద్ధుడి అంత్యక్రియలు ప్రారంభమైన రెండు గంటల తర్వాత..మృతుడు కుమారుడు, మరో నలుగురు సన్నిహిత కుటుంబ సభ్యులు PPE కిట్‌లు ధరించి దహన సంస్కారాలను పూర్తి చేశారని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..