Maharashtra: మహారాష్ట్రను భయపెడుతున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. తాజాగా ఎన్ని కేసులో తెలిస్తే..

|

Apr 24, 2021 | 8:59 PM

Maharashtra Corona Updats: దేశంలో ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే.. మరో వైపు కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య మరణాల సంఖ్య తీవ్ర..

Maharashtra: మహారాష్ట్రను భయపెడుతున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. తాజాగా ఎన్ని కేసులో తెలిస్తే..
Maharashtra Corona Updats
Follow us on

Maharashtra Corona Updats: దేశంలో ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే.. మరో వైపు కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య మరణాల సంఖ్య తీవ్ర స్థాయిలో నమోదు కావడంతో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక భారత్‌లో అధికంగా నమోదవుతున్న కరోనా జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,160 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 676 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,28,836 కాగా, మరణాల సంఖ్య 63,928కు చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 63,818 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 34,68,610కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,94,480 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.

అంతేకాదు భారత్‌లో కరోనా కేసులు, మరణాల నమోదుపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరో వైపు భారత్‌లో కోవిడ్‌ వ్యాప్తి తీవ్రతపై ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాగే అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం భారత్‌లో ఉన్న పరిస్థితులపై వివిధ రకాల కథనాలు ప్రచురిస్తున్నాయి.

ఇవీ చదవండి: Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాపై నిషేధం ఎత్తివేత.. ప్రకటించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు