Lockdown: ఇలాగే కొనసాగితే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి.. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.

|

Apr 02, 2021 | 9:51 PM

CM About Lockdown: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని మళ్లీ భయాందోళనలకు గురి చేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతోన్న కేసులు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇక మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలం రేపుతోంది...

Lockdown: ఇలాగే కొనసాగితే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి.. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.
Lock Down In Maharasthra
Follow us on

CM About Lockdown: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని మళ్లీ భయాందోళనలకు గురి చేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతోన్న కేసులు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇక మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలం రేపుతోంది. ఊహించని స్థాయిలో కొత్త కేసులు నమోదువుతన్నాయి. గురువారం ఒక్కరోజే ఏకంగా 40 వేలకిపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
కేసులు తీవ్రంగా పెరుగుతోన్న నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని చర్చ జరుగుతున్న తరుణంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. ప్రస్తుతానికైతే లాక్‌డౌన్‌ ఆలోచనలేదని స్పష్టం చేశారు. అయితే కరోనా తీవ్రత ఇలాగే కొనసాగితే కచ్చితంగా లాక్‌డౌన్‌పై ఆలోచించే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఒకవేళ లాక్‌డౌన్‌ అంటూ విధిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత కుదేలయ్యే పరిస్థితి ఉంటుందని ఆయన తెలిపారు. కరోనా కేసులు ఇలాగే పెరిగితే మరో 15 రోజుల్లో పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం ఉందని ఆలోచన వ్యక్తం చేశారు. గతేడాది కంటే ఈసారి కరోనా మరింత విజృంభించిందని, కొత్త రూపు సంతరించుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఐసీయూ సంఖ్యను పెంచవచ్చు, బెడ్ల సంఖ్యను పెంవచ్చు కానీ వైద్యులను ఎక్కడి నుంచి తీసుకువస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు మాస్కులు తూచా తప్పక ధరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవాలని, ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని చెప్పుకొచ్చారు.

Also Read: Tamil Nadu Assembly Elections : కేంద్రహోం మంత్రి అమిత్ షా పై డీఎంకే నేత ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు.. బహిరంగ సవాళ్లు

దీదీని గద్దె దించండి.. ఒక్క పిట్టను కూడా బెంగాల్‌లో అడుగుపెట్టనీయం.. అలిపుర్దూరు ప్రచారసభలో కేంద్రమంత్రి అమిత్ షా

ప్రభుత్వ ఉద్యోగులు అలర్ట్.. పాత పెన్షన్ స్కీంకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఎవరెవరు అర్హులంటే..?