Maharashtra: త్వరలోనే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తా.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే కీలక నిర్ణయం

| Edited By: Ravi Kiran

Jul 05, 2022 | 8:15 AM

పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ అంశంపై మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన ధరలపై త్వరలోనే వ్యాట్ తగ్గిస్తామన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ఏక్ నాథ్ షిండే...

Maharashtra: త్వరలోనే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తా.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే కీలక నిర్ణయం
Maharashtra CM Eknath Shinde (File Photo)
Follow us on

పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ అంశంపై మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన ధరలపై త్వరలోనే వ్యాట్ తగ్గిస్తామన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గెలిచారు. వివిధ రకాల కారణాలతో దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రప్రభుత్వం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రాలూ వ్యాట్‌ తగ్గించాలని కోరింది. అయితే, వ్యాట్‌ తగ్గించేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బీజేపీ మద్దతుతో షిండే ప్రభుత్వం ఏర్పాటు కాగానే వ్యాట్‌ను తగ్గించనున్నట్టు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. దేశంలో గత కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇతర ప్రాంతాలతో పోలిస్తే పెట్రోల్‌ ధర ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.35, డీజిల్‌ ధర రూ.97.28గా ఉంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దక్కడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే స్పందించారు. బీజేపీ (BJP) లీడర్ దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నట్లు తాను భావించానని, కానీ యాధృచ్ఛికంగా ఆ పదవి తనకు దక్కిందని అన్నారు. మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పదవి ఎన్నిక సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలే ఇప్పటివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాయన్న శిండే.. ఈసారి ప్రభుత్వంలో ఉన్న నేతలే ప్రతిపక్షంగా మారారని వ్యాఖ్యానించారు. మంత్రులతో సహా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి బయటకు రావడం మామూలు విషయం కాదన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే ఆనంద్ డిఘేల భావజాలానికి అంకితమైన తన లాంటి సాధారణ కార్యకర్తకు ఇది చాలా పెద్ద విషయమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి