Social Media Reels: ప్రాణం తీసిన రీల్స్‌ మోజు..! బావిపైకి ఎక్కి ఫోజులివ్వబోయాడు కానీ అంతలోనే..

రీల్స్‌ మోజులో పడి ఓ టీనేజర్‌ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పురాతనకాలపు బావిపైకి ఎక్కి రీల్స్ చేయబోయి ప్రమాదవశాత్తు దానిలో పడిపోయాడు. 32 గంటల తర్వాత శవమై తేలాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో బుధవారం (జూన్‌ 14) వెలుగుచూసింది..

Social Media Reels: ప్రాణం తీసిన రీల్స్‌ మోజు..! బావిపైకి ఎక్కి ఫోజులివ్వబోయాడు కానీ అంతలోనే..
Socila Media Reels

Updated on: Jun 15, 2023 | 12:35 PM

కళ్యాణ్: రీల్స్‌ మోజులో పడి ఓ టీనేజర్‌ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సాగరసంగమం మువీలో కమల్ హాసన్ మాదిరి బావిపైకి ఎక్కి రీల్స్ చేయబోయాడు. కానీ అంతలోనే ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. 32 గంటల తర్వాత శవమై తేలాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో బుధవారం (జూన్‌ 14) వెలుగుచూసింది.

మహారాష్ట్రలోని డోంబీవలీ పరిధిలోని ఠాకురలీ ప్రాంతానికి చెందిన బిలాల్‌ సోహేల్‌ షేక్‌ (18) అనే యువకుడికి రీల్స్‌ అంటే మహా ఇష్టం. రకరకాల రీల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జూన్‌ 11 నాడు తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో రీల్స్‌ షూట్‌ చేసేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి ముంబ్రాలోని చాంద్‌నగర్‌ సమీపంలోని బ్రిటీష్‌ కాలం నాటి పంప్‌ హౌస్‌కు అనుసంధానంగా ఉన్న బావి వద్దకు వచ్చాడు. ఆ బావి చాలా లోతైనది కావడంతో స్థానికులెవ్వరూ ఆ ప్రాంతానికిరారు. అక్కడ కాపలాగా ఓ సెక్యురిటీ గార్డు కూడా ఉన్నాడు.

ఐతే రీల్స్‌ చేస్తున్న సమయంలో బావి పైకి ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు దానిలో పడిపోయాడు. బిలాల్‌ బాలిలో పడిపోవడాన్ని గమనించిన అతని స్నేహితులు సమీపంలో ఉన్న సెక్యూరిటీ గార్డుకు సమాచారం అందించారు. అతను విష్ణునగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి తెలిపాడు. ఈ క్రమంలో బిలాల్‌ ప్రాణం పోయింది. బిలాల్‌ను కాపాడేందుకు ప్రయత్నించాడు. ప్రమాదం జరిగిన సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సరదాగా రీల్‌ చేస్తున్నాడని భావించామని, ఆ సరదే తమ కొడుకును బలి తీసుకుంటుందని ఊహించలేకపోయామని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.