AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prayagraj: ఇప్పటి వరకూ మహా కుంభమేళాకు ఎంతమంది భక్తులు వచ్చారో తెల్సా..ఇదో రికార్డ్..

మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. వసంత పంచమి సందర్భంగా భక్తులు భారీ స్థాయిలో పోటెత్తుతున్నారు. ఈ రద్దీకి తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో నిత్యం లక్షలాది మంది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడికి వీఐపీల తాకిడి కూడా బలంగానే ఉంది...

Prayagraj: ఇప్పటి వరకూ మహా కుంభమేళాకు ఎంతమంది భక్తులు వచ్చారో తెల్సా..ఇదో రికార్డ్..
Maha Kumbh Mela
Ram Naramaneni
|

Updated on: Feb 03, 2025 | 1:25 PM

Share

ఇప్పటి వరకూ మహా కుంభమేళాకి 35 కోట్ల మంది వచ్చారని అధికారులు వెల్లడించారు. మౌని అమావాస్యతో పాటు వసంత పంచమి కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని తెలిపారు. ఇవాళ (ఫిబ్రవరి 3వ తేదీ) ఉదయం 8 గంటల సమయానికి కేవలం ఒక్కరోజులోనే దాదాపు 62 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాకు వచ్చారు. చరిత్రలో ఒక్కరోజులోనే కుంభమేళాకు ఇంత మంది ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు అధికారులు. ఈ సారి రికార్డు స్థాయిలో రద్దీ నెలకొంది. మహా కుంభమేళాకి మరో 23 రోజుల సమయం ఉంది. మిగిలిన ఈ రోజుల్లో కనీసం మరో 5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కేవలం దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ సారి ఎక్కువగా తరలి వస్తుండడం విశేషం. ఫిబ్రవరి 2వ తేదీన దాదాపు కోటి 20 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.

మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికారులు వెల్లడించారు. మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30వ తేదీన రెండు కోట్ల మంది భక్తులు వచ్చారు. పౌష్య పూర్ణిమ రోజున కోటి 70 లక్షల మంది హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ సమయంలోనే త్రివేణి సంగమంలో నదీ స్నానం చేశారు. అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు తెచ్చుకున్న మహా కుంభమేళాకు వెళ్లడం ఎంతో పుణ్యమని విశ్వసిస్తారు భక్తులు. ముఖ్యంగా ఆ సమయంలో నదీ స్నానం ఆచరించడం ఉత్తమమని భావిస్తారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన మొదలైన మహా కుంభమేళా..ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్న ఈ ఉత్సవం..రాబోయే రోజుల్లో మరెన్నో రికార్డులు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యోగి సర్కార్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాట్లు చేసింది. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..    

Follow Us
ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం
ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం
దోమ కరిచిన చోట దద్దుర్లు, దురద వస్తున్నాయా?. అసలు మ్యాటర్ ఇదే
దోమ కరిచిన చోట దద్దుర్లు, దురద వస్తున్నాయా?. అసలు మ్యాటర్ ఇదే
నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
బెంగళూరు పగ తీర్చుకుంటుందా? సన్‌రైజర్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా
బెంగళూరు పగ తీర్చుకుంటుందా? సన్‌రైజర్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా
ఇది కదా కావాల్సింది.. ఈ లోన్స్ తీసుకుంటే సర్కారే సగం డబ్బు..
ఇది కదా కావాల్సింది.. ఈ లోన్స్ తీసుకుంటే సర్కారే సగం డబ్బు..
ఆ వెబ్‌ సిరీస్ చూసి ఎంతపని చేశావ్ పద్మ.. ప్రియుడితో కలిసి
ఆ వెబ్‌ సిరీస్ చూసి ఎంతపని చేశావ్ పద్మ.. ప్రియుడితో కలిసి
కుక్కర్లో వండినా అన్నం ముద్దవ్వదు.. ఈ చిన్న ట్రిక్ తెలుసా?
కుక్కర్లో వండినా అన్నం ముద్దవ్వదు.. ఈ చిన్న ట్రిక్ తెలుసా?
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట