మహా కుంభమేళాకు వేళాయింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ సర్కార్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకంగా హైఎండ్ టెక్నాలజీని వాడుతున్నారు. అండర్ వాటర్ డ్రోన్లను అందుబాటులోకి తెస్తున్నారు. సీసీ కెమెరా నిఘా నేత్రాలు ఎటూ వుంటాయి. ఐతే ఈసారి సరికొత్తగా అండర్‌వాటర్ డ్రోన్లను వినియోగించబోతున్నారు. ట్రయిల్స్ కూడా నిర్వహించారు.
ఎవరైనా నీళ్లలో మునిగిపోతే వెంటనే గుర్తించే వారిని కాపాడేలా అండర్ వాటర్ డ్రోన్లను వినియోగంలోకి తెస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో పర్యాటకుల వసతి సహా భద్రత కోసం పకడ్బందీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తలెత్తకుండా .. మహాకుంభమేళ-2025ని విజయవంతం చేసేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు.
మహాకుంభమేళను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి మహాకుంభమేళాను గతంలో కంటే అద్భుతంగా నిర్వహిస్తామంటున్నారు అధికారులు. హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని తీరాలల్లో కుంభమేళ ఏర్పాట్ల సందడి మొదలైంది. సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభ మేళా ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. కుంభ మేళ సమయంలో నదీ స్నానం చేస్తే మోక్షం కలుగుగుతుందనేది భక్తులు విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..