Special Offer: ఈ రెస్టారెంట్‌లో రూ.60కే అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. తినలేక మిగిల్చారో జేబుకు చిల్లు ఖాయం..

|

Mar 14, 2023 | 3:37 PM

కమ్మని ఘుమఘుమలు ఎక్కడ నుంచి వచ్చినా భోజన ప్రియులు అక్కడ వాలిపోతుంటారు. చకచకా కావల్సిన పదార్ధాలన్నీ ఆర్డర్‌ చేసి, లొట్టలేసుకుంటూ కడుపునిండా సుష్టిగా తిని.. ఆనక మిగిలిన భోజనాన్ని నిర్లక్ష్యంగా వదిలేసి బిల్లు చెల్లించి వెళ్తుంటారు..

Special Offer: ఈ రెస్టారెంట్‌లో రూ.60కే అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. తినలేక మిగిల్చారో జేబుకు చిల్లు ఖాయం..
Restaurant Special Offer
Follow us on

కమ్మని ఘుమఘుమలు ఎక్కడ నుంచి వచ్చినా భోజన ప్రియులు అక్కడ వాలిపోతుంటారు. చకచకా కావల్సిన పదార్ధాలన్నీ ఆర్డర్‌ చేసి, లొట్టలేసుకుంటూ కడుపునిండా సుష్టిగా తిని.. ఆనక మిగిలిన భోజనాన్ని నిర్లక్ష్యంగా వదిలేసి బిల్లు చెల్లించి వెళ్తుంటారు. ఇంట్లో, ఫంక్షన్లు, పార్టీలు.. ఇలా ఎక్కడైనా మిగిలిపోయిన ఆహారాన్ని వృధాగా పారవేస్తుంటారు. ఓ వైపు ఇలా ఆహారం వృధా అవుతుంటే.. మరోవైపు ఆకలితో అలమటించే పేదలు సర్వత్రా దర్శనమిస్తుంటారు. దీనికి చెక్‌ చెట్టేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ హోటల్‌ వినూత్నంగా ఆలోచించింది. తక్కువ ధరకే భోజనాన్ని అందించడమేకాకుండా భోజనం వృధా చేసే వారికి జరిమానాలు విధిస్తోంది. వివరాల్లోకెళ్తే.. ఐతే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని కర్నావత్ రెస్టారెంట్ రూ. 60కే అన్‌లిమిటెడ్‌ భోజనాన్ని అందిస్తోంది. బోర్డు చూసి లోపలికి వెళ్లిన వారంతా తాము తినగలిగినంత తిని బిల్లు చెల్లించి జాగ్రత్తగా బయటికి వస్తుంటారు. ఐతే బిల్లు తక్కువే కదా అని ఎవరైనా తినగలిగిన దానికన్నా అధికంగా ఆర్డర్‌ చేస్తే మాత్రం చిక్కుల్లో పడవల్సి ఉంటుంది. ఎందుకంటే కర్నావత్ రెస్టారెంట్ గోడపై ఆహారాన్ని వృధా చేసినందుకు రూ.50 జరిమానా చెల్లించవల్సి ఉంటుందని స్పష్టంగా రాసి ఉంటుంది.

ఔట్‌లెట్ యజమాని అరవింద్ సింగ్ కర్నావత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆహారాన్ని వృథా చేయకూడదనే అలవాటును ప్రజల్లోకి తీసుకురావడం కోసమే ఇదంతా చేస్తున్నాం. రైతులు ఎంతో కష్టపడి పండించిన ఆహారాన్ని వృథా చేయడం అనైతికం. కనీసం రెండు పూటలా భోజనం కూడా చేయలేని వారు ఎందరో ఉన్నారు. మా రెస్టారెంట్‌కు వచ్చినవారంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇక్కడ కస్టమర్లు వదిలేసిన ఆహారాన్ని పారవేయడం లేదు. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్నామని’ ఆయన అన్నారు. కాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన 2021 డేటా ప్రకారం.. మన దేశంలో ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో సగటున 50 కిలోల వరకు ఆహారం వృధా చేస్తున్నాడట. మరోవైపు ఆకలితో అలమటించే ప్రపంచంలోని 121 దేశాలలో ఇండియా 107వ స్థానంలో ఉండటం గమనార్హం. ఆహారం విలువ తెలుసుకుని మసలుకోవాలనే ఈ రెస్టారెంట్‌ వినూత్న ఆలోచన ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.