Loan to Buy a Helicopter :హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం ఇప్పించండి… రాష్ట్రపతికి లేఖ రాసిన ఓ మహిళ..

|

Feb 12, 2021 | 11:49 AM

Helicopter Loan: మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతికి ఓ మహిళ రాసిన లేఖ వైరల్‌గా మారింది. మాండ్‌సౌర్ జిల్లాకు చెందిన ఆ మహిళ తనకు హెలికాప్టర్ కొనడానికి రుణం ఇవ్వమని..

Loan to Buy a Helicopter :హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం ఇప్పించండి... రాష్ట్రపతికి లేఖ రాసిన ఓ మహిళ..
Buy a Helicopter Loan
Follow us on

Loan to Buy a Helicopter : మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతికి ఓ మహిళ రాసిన లేఖ వైరల్‌గా మారింది. మాండ్‌సౌర్ జిల్లాకు చెందిన ఆ మహిళ తనకు హెలికాప్టర్ కొనడానికి రుణం ఇవ్వమని రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే.. తన పొలం సరిహద్దుల్లో ఉన్న మరో పొలం యజమాని దారిని మూసివేయడంతో తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడం అసాధ్యంగా మారింది. ఇదే విశయాన్ని చాలాసార్లు స్థానిక జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులకు గత కొంతకాలం తాను ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళా రైతు…తన సమస్యను తానే పరిష్కరించుకోవాలని అనుకుంది. వెంటనే తన సమస్యపై రాష్ట్రపతికి ఒక లేఖ రాసింది. ఆ తరువాత ఆమె తన లేఖతో తన ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది, అంతే అది కాస్తా వైరల్ అయ్యింది.

మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్ జిల్లాలోని బర్ఖేడా గ్రామంలో నివసిస్తున్న బసంతి బాయి ఈ లేఖ రాశారు. బసంతి బాయి బంధువులలో ఒకరు ఇదే అంశంపై మాట్లాడుతూ.. “ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె నిస్సహాయంగా ఉంది, అధికారులకు ఒక లేఖ రాయాలని నిర్ణయించుకుంది. ఓ టైపిస్టు సహకారంతో ఈ లేఖ రాయించింది. రహదారి అడ్డుపడితే ఆమె తన వ్యవసాయ క్షేత్రానికి ఎలా చేరుకుంటుంది. అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందకవడంతో బసంతి ప్రయాణానికి హెలికాప్టర్ అందించాలని కోరింది. ”

ఈ వార్త మీడియా దృష్టికి రావడంతో స్థానిక ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ స్పందించారు. వెంటనే తన సహాయం బసంతి బాయికి అందించారు. అతను ఇలా అన్నాడు, “ఆమె తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకోలేకపోతే, ఈ సమస్యను పరిష్కరించడానికి నేను ఖచ్చితంగా ఆమెకు సహాయం చేస్తాను, కాని ఆమెకు హెలికాప్టర్ ఇవ్వడం ద్వారా కాదు.” అంటూ పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పటివరకు రాష్ట్రపతికి పంపబడలేదు కాని సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి..

Singareni Job Notification : సింగరేణి కొలువులకు భారీగా పోటీ.. పరీక్షల్లో ఎక్కువగా వీటిపైనే ప్రశ్నలు..!

West Bengal Bandh : రసవత్తరంగా మారిన బెంగాల్‌ రాజకీయాలు.. ఉదయం నుంచే నిరసన సెగలు..