AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె చనిపోయాక ఊహించని పని చేసిన భర్త

భార్యపై ఆ భర్తకు అమితమైన ప్రేమ. అయితే ఆమె అనారోగ్యంతో మృతిచెందింది. అయినప్పటికీ ఆమె తనతోనే ఉండాలని ఆ భర్త ఊహించని పని చేశాడు.

Viral: భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె చనిపోయాక ఊహించని పని చేసిన భర్త
Madhya Pradesh News
Ram Naramaneni
|

Updated on: Aug 26, 2022 | 3:59 PM

Share

భార్యభర్తల బంధం ఎంతో గొప్పది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ప్రయాణం చేయడం అనేది గొప్ప విషయం. ఇరువురు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చికుంటూ, ప్రేమను పంచుకుంటూ ముందుకు సాగుతుంటే.. ఆ సంసారం పచ్చగా ఉంటుంది. భార్యపై అమితమైన ప్రేమను ప్రదర్శించే భర్తలు ఇప్పుడు సొసైటీలో తగ్గిపోయారనే చెప్పాలి. ఎక్కువ ప్రేమను పంచే భర్తలు తన వైఫ్‌లకు విలువైన గిఫ్టులు ఇస్తుంటారు.. ఇంకొందరు రకరకాల సర్‌ప్రైజ్‌లు ఇచ్చి వాళ్లను ఎగ్జైట్ చేస్తారు. భాగస్వామికి చిన్న బాధ వచ్చినా తట్టుకోలేరు కొందరు. అయితే తాజాగా ఓ భర్త చేసిన పని చర్చనీయాంశమైంది. భార్య చనిపోతే.. ఆమె తనతోనే ఉండాలని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని డిండౌరీ(Dindori) వార్డ్​ నంబర్​ 14లో ఈ ఘటన వెలుగుచూసింది. అక్కడ నివాసం ఉండే ఓంకార్​ దాస్ అనే వ్యక్తి లోకల్ స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తున్నాడు. అతనికి రుక్మిణి అనే మహిళతో పాతికేళ్ల క్రితం మ్యారేజ్ అయ్యింది. అయితే ఈ కపుల్‌కు పిల్లలు లేరు. అయినప్పటికీ ఆలూమగలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే హెల్త్ పాడవడంతో.. ఆగస్టు 23న చనిపోయింది. అయితే ఆమెపై అతి ప్రేమతో  ఇంట్లోనే డెడె‌బాడీని పూడ్చిపెట్టాడు ఓంకార్ దాస్. విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల వారు.. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వాళ్లు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో.. కలెక్టర్ కార్యలయంకు వెళ్లి కంప్లైంట్ చేశారు. దీంతో వెంటనే స్థానిక తహశీల్దార్ రంగంలోకి దిగి.. పోలీసులను తీసుకువెళ్లి.. డెడ్‌బాడీని బయటకు తీసి నర్మదా నది ఒడ్డున పాతిపెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..