Cold Tea: ముఖ్యమంత్రికి చల్లని టీ.. అధికారికి షోకాజ్ నోటీసులు.. సరైన వివరణ ఇవ్వకపోతే..

|

Jul 12, 2022 | 8:46 PM

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజకీయ ప్రముఖులకు చల్లని టీ అందించిన వ్యవహారంలో.. సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు జూనియర్ సప్లై అధికారిని హెచ్చరించారు.

Cold Tea: ముఖ్యమంత్రికి చల్లని టీ.. అధికారికి షోకాజ్ నోటీసులు.. సరైన వివరణ ఇవ్వకపోతే..
Tea
Follow us on

CM Shivraj Singh Chouhan: ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంతి.. అలాంటి వ్యక్తికి చల్లని చాయ్ అందించారు అక్కడి అధికారులు. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాలను చూసుకున్న ఓ అధికారికి షోకాజ్ నోటిసులు అందించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజకీయ ప్రముఖులకు చల్లని టీ అందించిన వ్యవహారంలో.. సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు జూనియర్ సప్లై అధికారిని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి అందించిన టీ నాసిరకంగా ఉందని, పైగా చల్లగా ఉందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఛాతర్‌పూర్‌ జిల్లా రాజ్‌నగర్‌ సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌(ఎస్‌డీఎం) డీపీ ద్వివేది.. జూనియర్‌ సప్లై ఆఫీసర్‌ రాకేశ్‌ కాన్హౌ ప్రోటోకాల్‌ ఉల్లంఘించారంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం సోమవారం ఖజురహో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్‌ వీఐపీ​లాంజ్‌లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు వేచిఉన్నారు. ఈ సమయంలో అధికారులు వారికి టిఫిన్‌తో పాటు టీ అందించారు. అయితే సీఎం, రాజకీయ నాయకులకు అందించిన టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఈ వ్యవహారాలను చూసుకున్న జూనియర్‌ సప్లై ఆఫీసర్‌ రాకేశ్‌కు నోటీసులు పంపించారు. నాసికరం, పైగా చల్లారిన టీ అందించినందుకు మూడు రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌డీఎం ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం