MP Urinating Case: వీడిని చెప్పుతో కొట్టినా తక్కువే..! గిరిజన యువకుడి ముఖంపై మూత్రవిసర్జన.. వీడియో వైరల్

|

Jul 05, 2023 | 3:02 PM

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి ప్రాంతంలో అమానుష చర్య చోటుచేసుకుంది. గిరిజన యువకుడి ముఖంపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఈ అనాగరిక చర్యకు..

MP Urinating Case: వీడిని చెప్పుతో కొట్టినా తక్కువే..! గిరిజన యువకుడి ముఖంపై మూత్రవిసర్జన.. వీడియో వైరల్
MP Urinating Case
Follow us on

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి ప్రాంతంలో అమానుష చర్య చోటుచేసుకుంది. గిరిజన యువకుడి ముఖంపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన నిందితుడిని బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అతని స్వగ్రామం కుబ్రిలో పట్టుబడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఓ పోలీసధికారి తెలిపారు. వివరాల్లోకెళ్తే..

భోపాల్‌లోని సిధిలోని బహ్రీ ప్రాంతంలోని కుబ్రి గ్రామానికి చెందిన నిందితుడు ప్రవేశ్‌ శుక్లా ఓ ఆదివాసీ వ్యక్తి ముఖంపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా పులువురు ఈ అమానుష చర్యను వ్యతిరేకిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గంటల వ్యవధిలోనే #ArrestPraveshShukla హ్యాష్‌ ట్యాగ్‌ దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేసింది. సభ్యసమాజం సిగ్గుపడేలా నీచమైన, హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ముఖ్యమంత్రిని సోషల్‌ మీడియా వేదికగా కోరారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం కాస్తా రాజకీయ రంగు పులుమకోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘నిందితుడిని అరెస్టుకు ఆదేశించాం. ఎన్‌ఎస్‌ఏ విధించాలని అడ్మిన్‌ను ఆదేశించా’నన్నారు. నిందితుడు ప్రవేశ్‌ శుక్లాపై మంగళవారం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, అరెస్టు చేసినట్లు డీఐజీ-రేవా మిథ్లేష్ శుక్లా తెలిపారు. బాధితుడు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)కి చెందిన వ్యక్తిగా పోలీసులు ధృవీకరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.