MP Girls Missing Case: ‘హాస్టల్‌లో అదృశ్యమైన 26 మంది బాలికలు.. వారంతా సేఫ్‌’: ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌

|

Jan 07, 2024 | 7:36 AM

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ఓ వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కనిపించకుండా పోయిన బాలికలంతా గుజరాత్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వారు. అదృశ్యమైన వారిలో 12 మందిని పోలీసులు పట్టుకున్నారు. బాలికల అదృశ్యానికి బాధ్యులను చేస్తూ ఇద్దరు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులను..

MP Girls Missing Case: హాస్టల్‌లో అదృశ్యమైన 26 మంది బాలికలు.. వారంతా సేఫ్‌: ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌
Bhopal Children’s Home Missing Girls
Follow us on

భోపాల్‌, జనవరి 7: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ఓ వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కనిపించకుండా పోయిన బాలికలంతా గుజరాత్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వారు. అదృశ్యమైన వారిలో 12 మందిని పోలీసులు పట్టుకున్నారు. బాలికల అదృశ్యానికి బాధ్యులను చేస్తూ ఇద్దరు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) చైర్మన్‌ ప్రియాంక్‌ కనుంగో శుక్రవారం భోపాల్‌ శివారు పర్వాలియా ప్రాంతంలోని ఆంచల్‌ బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా బాలికల అదృశ్యం సంగతి వెలుగు చూసింది.

తనిఖీలో మొత్తం 68 మంది బాలికల్లో 26 మంది అక్కడి హాస్టల్‌లో లేనట్లు ఛైర్మన్‌ ప్రియాంక్‌ కనుంగో గుర్తించారు. దీనిపై వసతి గృహం డైరెక్టర్‌ను ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా హాస్టల్‌ను నిర్వహించడమే కాకుండా అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. తప్పిపోయిన బాలికలు 6 నుంచి 18 ఏళ్ల లోపు వారని, వీరిలో కొందరు వీధుల్లో అనాథలుగా ఉన్నవారని ప్రియాంక కనుగో ట్వీట్‌ చేశారు. పైగా, నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ పురుష గార్డులు విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె తన ట్వీట్‌లో తెలిపారు.

అదృశ్యమైన బాలికలు సేఫ్‌: మధ్యప్రదేశ్‌ సీఎం

రంగంలోకి దిగిన పోలీసులు కనిపించకుండా పోయిన బాలికల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. వారంతా ఎక్కడున్నారో కనుక్కున్నారు. ఈ సంఘటనపై ఆ రాష్ట్ర సీఎం మోహన్‌ యాదవ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. కనిపించకుండా పోయిన బాలికలందరినీ గుర్తించినట్లు తెలిపారు. వారంతా క్షేమంగానే ఉన్నట్లు స్పషం చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహాలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని, ఎలాంటి రిజిస్ట్రేషన్లు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వసతి గృహాలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులపై బెంగతోనే బాలికలు తమ ఇళ్లకు వెళ్లేందుకు హాస్టల్‌ వదిలి వెళ్లినట్లు భోపాల్‌ రూరల్‌ ఎస్పీ ప్రమోద్‌ కుమార్‌ సిన్హా మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.