LPG Prices: వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు..
గృహ వినియోగదారులకు గుడ్ న్యూస్. గతేడాది ఆగష్టు నుంచి పెరుగుతూ వస్తున్న సబ్సిడీయేతర గ్యాస్ సిలెండర్(14.2) ధరలకు బ్రేక్ పడింది. అన్ని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి నుంచి సబ్సిడీ కాని గ్యాస్ సిలెండర్ల ధరలను ఆయిల్ సంస్థలు తగ్గించాయి.

LPG Prices Today: గృహ వినియోగదారులకు గుడ్ న్యూస్. గతేడాది ఆగష్టు నుంచి పెరుగుతూ వస్తున్న సబ్సిడీయేతర గ్యాస్ సిలెండర్(14.2) ధరలకు బ్రేక్ పడింది. అన్ని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి నుంచి సబ్సిడీ కాని గ్యాస్ సిలెండర్ల ధరలను ఆయిల్ సంస్థలు తగ్గించాయి. ఇక ఆ తగ్గిన రేట్లన్నీ ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. గత ఆరు నెలల్లో నాన్- సబ్సిడీ గ్యాస్ సిలెండర్ ధరలు ఆరు సార్లు పెరగగా.. తగ్గడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ రోజు నుంచి గృహ వినియోగాలకు ఉపయోగించే సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.53 మేరకు తగ్గింది. ప్రస్తుతం ఈ గ్యాస్ ధర రూ.858గా ఉంది. తాజా తగ్గింపుతో అది కాస్తా రూ.805కు చేరింది.
నగరాల వారీగా తగ్గిన ధరలు ఇలా ఉన్నాయి…
ఢిల్లీ: రూ.805.5(పాతది రూ.858.50) కోల్‌కతా: రూ.839.5(పాతది రూ.896) ముంబై: రూ.776.5(పాతది రూ.829.50) చెన్నై: రూ.826(పాతది రూ.881.00)
For More News:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!
యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!
భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!
అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్… బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!
లీకైన దేవరకొండ ‘ఫైటర్’ లుక్.. ఫోటోలు వైరల్.!
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీల సిరీస్‌కు ఆ ఇద్దరూ దూరం.?

