ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలి.. కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ అనూహ్య ప్రతిపాదన

2024 సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉంది. ప్రధాని అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీయే వరుసగా మూడోసారి రేసులో నిలవనున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు వినిపిస్తున్నాయి.

ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలి.. కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ అనూహ్య ప్రతిపాదన
Priyanka Gandhi Vadra (File Photo)
Follow us

|

Updated on: May 18, 2023 | 12:10 PM

2024 సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉంది. ప్రధాని అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీయే వరుసగా మూడోసారి రేసులో నిలవనున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నుంచి నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అర్వింద్ కేజ్రీవాల్ తదితరుల ప్రధాని రేసులో ఉన్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల తరఫు ప్రధానమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా ప్రియాంక గాంధీ పేరుని ఆయన తెరమీదకు తీసుకొచ్చారు.  ప్రియాంక గాంధీని విపక్షాల తరఫున ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని సూచించారు. ఈ విషయంలో అన్ని విపక్షాలు ఏకతాటి పైకి రావాలని కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోగల సత్తా ప్రియాంక గాంధీ ఒక్కరికి మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోదీకి అతిపెద్ద ఇమేజ్ ఉన్న నాయకుడని గుర్తుచేశారు. ఆయన్ను ఎన్నికల్లో ఢీకొట్టాలంటే దేశ స్థాయి ఇమేజ్ కలిగిన వ్యక్తిని విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సి అవసరం ఉందన్నారు.

బీజేపీ తరఫున ప్రధాన మంత్రి రేసులో నరేంద్ర మోదీ నిలుస్తున్నందున.. విపక్షాలు కూడా తమ ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాలన్నారు. నితీష్ కుమార్, మమతా బెనర్జీ తదితరులకు వారివారి రాష్ట్రాల్లో మాత్రమే పాపులార్టీ ఉందన్నారు. వీరెవరూ పీఎం అభ్యర్థిగా సరిపోరని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కాదని ఆయన సోదరి ప్రియాంకను కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ ప్రతిపాదించడం జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

రాహుల్ గాంధీపై కాంగ్రెస్‌కు ఆశలు లేవ్..

ఆచార్య ప్రమోద్ వ్యాఖ్యలతో స్పందిస్తూ.. రాహుల్ గాంధీపై ఆశలు లేవని కాంగ్రెస్ పార్టీ స్వయంగా అంగీకరిస్తోదని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కర్ణాటక సీఎం విషయంలో ఆ పార్టీ నేతల మధ్య కుమ్ములాట నెలకొందని.. ఇప్పుడు ప్రధాని విషయంలో నెహ్రూ కుటుంబంలో కుమ్ములాట ఖాయమని బీజేపీ జాతీయ ఐటీ వింగ్ ఇంఛార్జ్ అమిత్ మాలవ్య ఓ ట్వీట్‌లో ఎద్దేవా చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..