‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 303 మంది, వ్యతిరేకంగా 82 మంది సభ్యులు.. సభలో వేటు వేశారు. కాగా.. ఎన్డీఏ సర్కారు గత లోక్‌సభ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి.. లోక్‌సభ ఆమోదం తెలిపినా.. విపక్ష సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తడంతో రాజ్యసభలో నిలిచిపోయింది. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపకముందే 16వ లోక్‌సభ రద్దయింది. ఏదైనా బిల్లు లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నా లోక్‌సభ రద్దయిన పక్షంలో ఆ బిల్లులు కూడా వాటంతట అవే రద్దయిపోతాయి.