Lok Sabha Elections 2024: ప్రియాంకతో కలిసి వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

|

Apr 03, 2024 | 4:05 PM

కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అతని సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.

Lok Sabha Elections 2024: ప్రియాంకతో కలిసి వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Nominations
Follow us on

కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అతని సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి నాలుగు లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. 2024 లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో వయనాడ్‌లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో వయనాడ్‌లోని ముప్పైనాడ్ అనే గ్రామానికి చేరుకుని, రోడ్డు మార్గంలో కలపేటకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు కల్‌పేట నుంచి ఆయన రోడ్‌షో ప్రారంభించారు. రోడ్ షోలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్నం సివిల్ స్టేషన్ దగ్గర రోడ్ షో ముగించిన తర్వాత రాహుల్ గాంధీ తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపా దాస్ మున్షీ, కన్హయ్య కుమార్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎం హసన్‌లతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం వయనాడ్‌కు వచ్చానని, ఆ సమయంలో కొత్తగా వచ్చానని, నన్ను మీ కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్నారన్నారు. వాయనాడ్ ప్రజలు ఎంతగానో ఆదరించారు అని రాహుల్ అన్నారు. వాయనాడ్‌లోని ప్రతి వ్యక్తి ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో స్వంత వ్యక్తిగా చూసుకున్నారని మరోసారి ఎంపీగా గెలిపించాలని రోరారు.

వయనాడ్‌లో రెండో దశలో ఓటింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న అక్కడ పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్‌పై రాహుల్ గాంధీ పోటీ చేశారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈసారి ఆయన బీజేపీ అభ్యర్థి కే సురేంద్రన్‌తో తలపడుతున్నారు. ప్రస్తుతం కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే భారతీయ జనతా యువమోర్చా వయనాడ్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన రాజకీయాలు ప్రారంభించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కె. సురేంద్రన్‌ పతనంతిట్ట నుంచి పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…