Rahul Gandhi: రాహుల్‌గాంధీ ఫూల్‌పూర్‌ సభలో యూత్‌ హంగామా.. బారికేడ్లు ధ్వంసం చేసి, స్టేజ్‌‌పైకి దూసుకొచ్చిన జనం

|

May 19, 2024 | 4:53 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ఫూల్‌పూర్‌ ఇండీ అలయన్స్ సభ సందర్భంగా నానా హంగామా జరిగింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌యాదవ్‌ కలిసి ప్రచారం నిర్వహించారు. అయితే సభా వేదిక దగ్గరకు చేరుకోవడానికి రాహుల్‌ నానా తంటాలు పడ్డారు. హెలిప్యాడ్‌లో జనం దూసుకు రావడంతో హెలీకాప్టర్ ల్యాండింగ్‌కు చాలా ఇబ్బంది కలిగింది. పోలీసుల వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనబడింది.

Rahul Gandhi: రాహుల్‌గాంధీ ఫూల్‌పూర్‌ సభలో యూత్‌ హంగామా.. బారికేడ్లు ధ్వంసం చేసి, స్టేజ్‌‌పైకి దూసుకొచ్చిన జనం
Rahul Gandhi Akhilesh Yadav
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ఫూల్‌పూర్‌ ఇండీ అలయన్స్ సభ సందర్భంగా నానా హంగామా జరిగింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌యాదవ్‌ కలిసి ప్రచారం నిర్వహించారు. అయితే సభా వేదిక దగ్గరకు చేరుకోవడానికి రాహుల్‌ నానా తంటాలు పడ్డారు. హెలిప్యాడ్‌లో జనం దూసుకు రావడంతో హెలీకాప్టర్ ల్యాండింగ్‌కు చాలా ఇబ్బంది కలిగింది. పోలీసుల వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనబడింది.

నేతలిద్దరూ రావడంతో కార్యకర్తలు అదుపుతప్పి నేతల వేదికపైకి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఎలాంటి ప్రసంగం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానంలో రాహుల్, అఖిలేష్ ఉమ్మడి బహిరంగ సభ జరగాల్సి ఉంది. ఈ గొడవలో పలువురు గాయపడ్డారు. దీంతో పాటు మీడియా సిబ్బంది కెమెరా స్టాండ్‌లు కూడా ధ్వంసమయ్యాయి. అంతకుముందు, రాంచీలోని ఇండియా బ్లాక్‌లో జరిగిన సమావేశంలో గొడవ జరిగింది. ఇందులో రెండు గ్రూపుల కార్యకర్తలు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు.

చివరికి అతికష్టం మీద రాహుల్‌ స్టేజ్‌ మీదకు చేరుకున్నారు. అయితే యువతను కంట్రోల్‌ చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. వారికి నచ్చచెప్పడానికి అఖిలేశ్‌ పదేపదే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికి చాలామంది స్టేజ్‌ మీదకు దూసుకురావడంతో నానా గందరగోళం ఏర్పడింది. సభలో రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీ ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి తాము పోరాటం చేస్తున్నామని అన్నారు రాహుల్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..