
సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏఫ్రిల్క్ష్ 19వ తేదీన జరిగింది. అయితే, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినా, పలు చోట్ల హింసాత్మక ఘటనల దృష్ట్యా రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
మణిపూర్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా హింస మరోసారి చెలరేగింది. దీంతో, ఆ పోలింగ్ ను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యం లోనే ఏఫ్రిల్ 22న మరోసారి ఓటింగ్ జరగనుంది. మణిపుర్ లోని 11 పోలింగ్ స్టేషన్ లలో మళ్లీ ఎన్నికలను నిర్వహించేలా ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇన్నర్ మణిపుర్ లోక్‌సభ స్థానంలోని 11 చోట్ల రీ పోలింగ్‌ను సోమవారం రోజున ఓటింగ్ నిర్వహించ నున్నట్లు తెలిపింది. ఈ నెల 19న ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం, బూత్ క్యాప్చరింగ్ వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికలను చెల్లనివిగా ఈసీ ప్రకటించింది.
కాంగ్రెస్ మాత్రం ఇన్నర్, ఔటర్ లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలోని 47 పోలింగ్ బూత్ ఆక్రమణ జరిగిందని, అన్ని చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..