Lok Sabha Elections: బెంగాల్‌లో బరితెగింపు.. చెరువులో ప్రత్యక్షమైన EVM, VVPAT మిషన్లు..!

|

Jun 01, 2024 | 10:38 AM

దేశశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల 7వ దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 11.31 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి దశలో పోలింగ్ జరగుతున్న పశ్చిమ బెంగాల్‌లోని పోలింగ్ బూత్‌ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Lok Sabha Elections: బెంగాల్‌లో బరితెగింపు.. చెరువులో ప్రత్యక్షమైన EVM, VVPAT మిషన్లు..!
Evm In Pond
Follow us on

దేశశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల 7వ దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 11.31 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి దశలో పోలింగ్ జరగుతున్న పశ్చిమ బెంగాల్‌లోని పోలింగ్ బూత్‌ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.జయనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని కుల్తాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని బేనిమాధవ్‌పూర్ పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఈవీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. అంతే కాకుండా 1 సీయూ, 1 బీయూ, 2 వీవీప్యాట్ యంత్రాలను చెరువులో పడేశారు. దీంతో సెక్టార్ ఆఫీసర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.

శనివారం ఉదయం చెరువులో ఈవీఎం విసిరిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి కుల్తాలీలోని పోలింగ్ బూత్ నంబర్ 40, 41 కు సంబంధించి ఈవీఎంగా అధికారులు గుర్తించారు. కొంతమంది పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లో కూర్చోవడానికి అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ స్టేషన్‌లోకి దూసుకువచ్చిన ఓ పార్టీ కార్యకర్తలు ఓటింగ్ మిషన్‌ను తీసుకెళ్ళి చెరువులో విసిరినట్లు స్థానిక ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది.

 

 

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశలో ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. గత నెల 19న ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద పోలింగ్ మారథాన్‌కు ఏడవ దశ గ్రాండ్ ఫినిష్‌ని సూచిస్తుంది. ఇప్పటికే ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది.

ఇక చివరి దశలో ఉదయం 9 గంటల వరకు 11.31 శాతం ఓటింగ్ నమోదైంది. హిమాచల్ ప్రదేశ్ 14.35 శాతం ఓటింగ్‌తో ముందంజలో ఉంది. ఉదయం 9 గంటల వరకు ఒడిశాలో అత్యల్పంగా 7.69 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే, హిమాచల్ ప్రదేశ్ – 14.35 శాతం, బీహార్ – 10.58 శాతం, చండీగఢ్ – 11.64 శాతం, జార్ఖండ్ – 12.15 శాతం, పంజాబ్ – 9.64 శాతం, ఉత్తర ప్రదేశ్ – 12.94 శాతం, పశ్చిమ బెంగాల్ – 12.63 శాతం, ఒడిశా- 7.69 శాతం పోలింగ్ నమోదైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…