Mohammed Shami: లోక్‌సభ బరిలో టీమిండియా బౌలర్‌ షమీ..? ఎక్కడి నుంచంటే..?

|

Mar 08, 2024 | 10:26 AM

బెంగాల్‌లో దీదీ మీదకు మోదీ బౌన్సర్‌ వేయబోతున్నారు. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీని బీజేపీ బరిలోకి దించాలని యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో క్రికెట్‌కు పెద్దపీట వేస్తుంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి క్రికెట్‌ స్టార్‌ మహ్మద్‌ షమీని రంగంలోకి దించే అవకాశాలను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది.

Mohammed Shami: లోక్‌సభ బరిలో టీమిండియా బౌలర్‌ షమీ..? ఎక్కడి నుంచంటే..?
Mohammed Shami Amit Shah
Follow us on

బెంగాల్‌లో దీదీ మీదకు మోదీ బౌన్సర్‌ వేయబోతున్నారు. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీని బీజేపీ బరిలోకి దించాలని యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో క్రికెట్‌కు పెద్దపీట వేస్తుంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి క్రికెట్‌ స్టార్‌ మహ్మద్‌ షమీని రంగంలోకి దించే అవకాశాలను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ఆడుతూ ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ ఖ్యాతిని పొందాడు. అతను ఇప్పటికీ బెంగాల్‌కు దేశవాళీ క్రికెట్ ఆడతాడు.

ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన తర్వాత షమీని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఏకంగా డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి షమీని మోదీ ఓదార్చడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. అనంతరం సీఎం యోగి షమీని కలిశారు. షమీ స్వగ్రామం అమ్రోహాలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న హీరోలలో షమీ ఒకరిగా ఉన్నందున, షమీని పొలిటికల్ ఫీల్డింగ్ చేయించడం ద్వారా ప్రధాని మోదీ మాస్టర్‌స్ట్రోక్ అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా కేంద్ర మంత్రి అమిత్ షా క్రికెటర్ షమీతో సమావేశమయ్యారంటున్నారు.

రంజీ ట్రోఫీలో షమీ బెంగాల్‌ తరపున ఆడాడు. ఒకవైపు మైనారిటీ కావడం, మరోవైపు బెంగాలీ క్రికెట్‌ కనెక్షన్‌ కారణంగా కాషాయపెద్దలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. బెంగాల్‌ నుంచి పోటీచేయాలనే ప్రతిపాదనను షమీ దగ్గరకు బీజేపీ పెద్దలు తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనతో బీజేపీ అధిష్టానం ఇప్పటికే మహ్మద్ షమీని సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. షమీని రంగంలోకి దింపడం ద్వారా బెంగాల్‌లో మైనారిటీ సీట్లను బీజేపీ గెలుచుకోవచ్చని బీజేపీ సన్నిహిత వర్గాల్లో చర్చ కూడా సాగుతోంది. అయితే శస్త్ర చికిత్స తర్వాత ప్రస్తుతం క్రికెట్‌కు విరామం ఇచ్చిన షమీదే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

బసిర్‌హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షమీని పోటీకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం చాలా సున్నితమైనది. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన భయంకరమైన ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చిన సందేశ్‌ఖాలీ బసిర్‌హత్ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మైనార్టీ ఓట్లు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి.

ప్రపంచకప్‌లో షమీ అద్భుత ప్రదర్శన

గతేడాది ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షమీని అర్జున అవార్డుతో సత్కరించారు. 33 ఏళ్ల షమీ ప్రపంచకప్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ-ఫైనల్‌లో 57 పరుగులకు 7 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. 50 ఓవర్ల ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ వికెట్ రికార్డు ఇది. ఈ టోర్నీలో షమీ 3 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…